శనివారం, ఫిబ్రవరి 24, 2024
Homeసినిమారోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి ! ఎన్టీఆర్ కుటుంభంలో విషాద ఛాయలు..

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి ! ఎన్టీఆర్ కుటుంభంలో విషాద ఛాయలు..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ కన్నుమూశారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందితూ మరణించారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు నెల్లూరు నుండి హైదరాబాద్ వస్తుండగా నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు వేరే వాహనాన్ని తప్పిస్తుండగా కారు టైరుకి రాయి తగలడంతో కారు డివైడర్ కు తగిలి  గాలిలో పల్టీలు కొడుతూ అవతలివైపు రోడ్డుమీద పడడంతో అటునుంచి వస్తున్నా వేరే వాహనం డీకోట్టింది.

దీనితో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నార్కెట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద సమయంలో కారుని హరికృష్ణ నడుపుతున్నట్లు సమాచారం

 

నెల్లూరు జిల్లా కావలిలో ఆయన మిత్రుని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.హరికృష్ణ మృతితో నెల్లూరు జిల్లా కావలిలో బృందావన్ కళ్యాణమండపంలో విషాద చాయలు అలుముకున్నాయి హరికృష్ణ మరణవార్త విని ఆయన మిత్రుడు మోహన్ కన్నీరుమున్నీరయ్యారు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular