కేరళ : ఎడతెరిపి లేని వర్షాలు కేరళను అతలాకుతలం చేసేసాయి వాగులు వంకలు నదులు పొంగిపొర్లి జలాశయాలు నిండిపోయాయి.ఇప్పటికే అధికారికంగా 350 కి పైగా మృత్యువాతపడగా లెక్కలకు అందని మరణాలు ఇంకా చాలా ఉంటాయని అంచనావేస్తున్నారు వరదలవల్ల నష్టం ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం ప్లాస్టిక్ మరియు భూతాపం కూడా కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తుంది కేరళలో ఓ బ్రిడ్జిపై నుంచి నాలుగు రోజుల పాటు ప్రవహించిన వరద నీరు తగ్గినా తరువాత అక్కడ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ సీసాల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ‘ప్రకృతికి మనం ఇచ్చిన బహుమతిని అది మనకు కృతజ్ఞతతో తిరిగిచ్చేసింది’ అన్న కామెంట్ తో షేర్ అవుతోంది. కేరళలో గత కొద్దికాలంగా అక్కడి నగరాలు పట్టణాల్లో ప్లాస్టిక్ను నిషేదించారు, అయితే ఇందిలూ ఎక్కువగా నిసేదించింది ప్లాస్టిక్ మరియు క్యారీ బ్యాగుల వరకే పరిమితం అవుతుంది అదికూడా అంతంత్ర మాత్రమే.
అందుకే ఆ రాష్ట్రంలో రోజుకు 480 టన్నుల ప్లాస్టిక్ వ్యర్దాలు ఉత్పత్తి అవుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్దాల నుండి గట్టెక్కడానికి ఆ రాష్ట్రంలో కొత్తగా వేసే రోడ్లలో 20 శాతం ఇలాంటి వ్యర్దాలతో వెయ్యాలని కూడా నిర్ణయించారు