మంగళవారం, జూన్ 25, 2024
Homeజాతీయంభారత జవాను గొంతుకోసిన పాక్ రేంజర్లు

భారత జవాను గొంతుకోసిన పాక్ రేంజర్లు

పాకిస్థాన్ సైన్యం మరోసారి కిరాతకంగా ప్రవర్తించింది పాకిస్థాన్ కు చెందిన రేంజర్లు బారత సెక్యూరిటీకి చెందిన సైనికుడి గొంతుకోసి చంపేసాయి. దీనితో జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద తీవ్ర కలకలం రేగింది. రామ్ గడ్ సెక్టారులో జరిగిన ఈ ఘటనతో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనికాదికారులు అప్రమత్తమయ్యారు. నిన్న బీఎస్ ఎఫ్ జవాను నరేoద్ర కుమార్ వీరమరణం పొందాడని, అయన శరీరంలో మూడు బుల్లెట్లు కూడా దిoచారని తెలిపారు.

భారత బీఎస్ఎఫ్ జవాను కనిపించకపోవడంతో ఈ విషయంపై పాక్ ఆర్మీతో భారత సైనికాధికారులు మాట్లాడి సంయుక్తంగా పెట్రోలింగ్ చేపట్టాలని ఆయన జాడను కనిపెడదామని కోరారు. అయితే పలు కారణాలు చెబుతూ వాతావరణం అనుకూలించదని పాక్ జవాబిచ్చింది దీనితో అనుమానం వచ్చి భారత ఆర్మీ సాహసోపేత ఆపరేషన్ చేపట్టి పాక్ భూబాగంలో నరేంద్ర కుమార్ మృతదేహం ఉందని గుర్తిoచి తీసుకువచ్చింది. దీనిమీద స్పందిస్తూ ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగనిస్తున్నామని భారత ఆర్మీ అధికారులతో పాటు విదేశాంగ శాక కూడా తీవ్రంగా ఆరోపించింది.

దీనిపై ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ భారత జవాన్ను  గొంతు కోసి ఆయన శరీరంలో మూడు బుల్లెట్లు దించారని తెలిపారు. పాక్ రెంజర్లె ఈ ఘాతుకానికి కారణమని బీఎస్ఎఫ్ తో పాటు ఇతర భారత దళాలు సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాక్యానించారు. ఈ చర్యలతో అంతర్జాతీయ సరిహద్దు వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular