ఆదివారం, మే 26, 2024
HomeసినిమాPrabhas దెబ్బకి బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు షాక్ ఇస్తున్న “సాహో” !

Prabhas దెబ్బకి బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు షాక్ ఇస్తున్న “సాహో” !

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది బాహుమాలి సినిమా ప్రభాస్ కు డబ్బుతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది. ఇప్పుడు Prabhas ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా “సాహో దీనిని 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పై  జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఈ నెల 13న రిలీజైన “సాహో” సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ మరియు లైక్స్ తో టాలివుడ్ నెంబర్ 1 ప్లేస్ సంపాదించింది. అదేకాక హిందీ లో ఎక్కువ లైక్స్ పొంది సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

ఇక అగస్ట్ 15న బాలీవుడ్ లో “సాహో” తో పాటు అక్షయ్ కుమార్ నటించిన “మిషన్ మంగళ్” మరియు జాన్ అబ్రహం నటించిన “బట్లా హౌస్” అదే రోజున “సాహో”ను డీకోట్టాలని చూస్తున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్ నటించిన “మిషన్ మంగళ్” ఇది 24 సెప్టెంబర్ 2014 న భారత శాస్తవేత్తలు ప్రతిస్టాత్మకంగా ఉపగ్రహాన్ని రూపొందించి దానిని అంగారక గ్రహం పైకి విజయవంతంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దీనిని ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్న మూవీ “మిషన్ మంగళ్” దీనిలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, సోనాక్సీ సిన్హా వంటి భారీ తారాగణంతో నిర్మిస్తున్నారు. ఇక జాన్ అబ్రహం నటిస్తున్న సినిమా “బట్లా హౌస్” ఇది 2008లో జరిగిన బట్లా హౌస్ ఎన్కౌంటర్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా రూపొందిన్స్తున్నారు.

దీనిలో జాన్ అభ్రహం పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా ఈ మూవీ లో జాన్ మృణాల్ థాకూర్, రవి కిషన్, ప్రకాష్ రాజ్ వంటి వారు నటిస్తున్నారు. ఇక “సాహో” మూవీ విషయానికొస్తే ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకూ చూడని హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా అత్యంత బారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ మూవీ లో Prabhas , శ్రద్ధా కపూర్, నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, అరున్ విజయ్, వెన్నెల కిషోర్, టిన్ను ఆనంద్ వంటి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుండి బారీ తారాగణం తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై బాలీవుడ్ లోని కొంత మంది క్రిటిక్స్ ఈ మూడు సినిమాలపై పోల్ నిర్వహించగా బాలీవుడ్ ప్రేక్షకులు “సాహో” కు బ్రమ్మరధం పట్టారు.

ఈ మూడింటిలో తాము “సాహో” సినిమాను ఇష్టపడుతున్నామని మొదటిరోజు సాహో సినిమాకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. తరువాత అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ సినిమా చూసేందుకు ఇష్టపడ్డారు చివరిగా జాన్ అబ్రహం బట్లా హౌస్ ఇష్టపడ్డారు.

దీనిని చూసి బాలీవుడ్ క్రిటిక్స్ ప్రభాస్ రేంజ్, స్టామినా విపరీతంగా పెరిగిందని, సినిమా గనుక హిట్ టాక్ వస్తే మిగతా రెండు సినిమాలపై ఆ ఎఫెక్ట్ భారీగా ఉంటుందని అబిప్రాయపడ్డారు. ఇక మిషన్ మంగళ్ నిర్మాత ట్విట్టర్ ద్వారా ఇలా అన్నారు.

ఆగస్ట్ 15న ఎట్టిపరిస్థితులలోనూ సినిమా రిలీజ్ చేస్తామని వాయిదా వేసే సమస్యే లేదన్నారు. దీనిని బెట్టి చూస్తె “సాహో” బాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు తేడా వస్తే స్టార్ హీరోలకూ షాక్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular