శుక్రవారం, మార్చి 31, 2023
Homeరాజకీయంప్రముఖ ఎమ్మెల్యే పై వేటు వేసిన టీడీపీ

ప్రముఖ ఎమ్మెల్యే పై వేటు వేసిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ అదిష్టానం ప్రముఖ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. కొన్నాల్లనుండి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకత్వంతో టచ్ లో ఉంటునట్లు టీడీపీ పార్టీ నాయకత్వానికి పిర్యాదులు వెళ్ళడంతో చంద్రబాబు ఎమ్మెల్యేను పిలిచి ఒకటి..రేడు సార్లు చెప్పిచూసినా మేడా వైకరిలో ఎటువంటి మార్పూ రాకపోవడంతో రాజంపేట కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు.

పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలను కలవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు దీనితో ఆయనను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తో బేటి అవుతారని బేటి అనంతరం మేడా మల్లిఖార్జున రెడ్డి వైసీపీ లో చేరతారని తెలుస్తోంది. కడప జిల్లాలో టీడీపీ కి అంతగా పట్టులేదు అలాంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి చివరి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం.

RELATED ARTICLES

Most Popular