ప్రభాస్ ఫాన్స్ కి పండగలాంటి వార్త | Good news for prabhas fans

prabhas new movie launching

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రవేసుకున్న జిల్ ప్రేమ్ రాధాకృష్ణ తన స్టైలిష్ మేకింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీనితో భాహుబలి లాంటి విజయం వచ్చినా కూడా రాధాకృష్ణ చెప్పిన కధ నచ్చడంతో తనతో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడు.

దీనితో ఈచిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు గోపికృష్ణ మూవీస్ సంస్థ కార్యాలయంలో జరిగాయి ఈచిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.

ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని రాధాకృష్ణ దర్శకత్వంలో నేను నటించబోయే త్రిభాష చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

prabhas new movie launching to day

బాహుబలి తరువాత అంతర్జాతీయ ఖ్యాతిపొందాడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యెక గుర్తింపు రావడంతో రాభోయే చిత్రాలను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. సాహో చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు బిల్లా తరువాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ టెక్నికల్గా భారీతనంతో పిరియాడికల్ మూవీగా నిర్మిస్తున్నారు.

బాలివుడ్ స్టార్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది భానీలను అందిస్తున్నాడు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనింగ్ లో ఎన్నో వరవడికలను సృష్టించిన రవీందర్, ఎడిటింగ్ తో ఎన్నో అద్భుతమైన హిట్స్ లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారు.

తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కనున్న ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేటట్టుగా ఉంటుందన్నారు దర్శకుడు రాధాకృష్ణ.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి