క్రికెట్ అభిమానులను అలరించే ఆసియా కప్ సమరం సిద్దమైంది. శనివారం శ్రీలంక, బంగ్లాదేశ్ మద్య తొలిమ్యాచ్ జరగనుంది.
DUBAI NEWS : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ నేడు ప్రారంభం కానుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మ సారధ్యంలో భారత్ ఆడనుంది. ఆసియాకప్ లో మొత్తం ఆరు సార్లు విజయం సాధించిన భారత్ ఈసారి కూడా కప్ గెలుస్తామనే ధీమాతో ఉంది.
ఇంకో 8 నెలల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ గెలవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని యోచిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 12 సార్లు ఆసియా కప్ నిర్వహించగా ఒక్కసారి మాత్రమే టీ20 ఫార్మాట్లో నిర్వహించారు ఈ సారి మాత్రం వన్డే ఫార్మాట్ లోనే జరగనుంది దీనిలో మొత్తం ఆరు దేశాలు ఆడనున్నాయి.
కొత్త పార్మాట్ : ఆసియా కప్ ఈసారి కొత్త ఫార్మాట్లోకి మారనుంది ఇంతకుముందు టోర్నీలో ఆడే ప్రతీ జట్టూ గ్రూప్ దశలో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడేది. గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ చేరేవి కానీ ఇప్పుడు ఆరు జట్లనూ రెండు గ్రూపులుగా విభజించారు.
అవి గ్రూప్ దశలో వేరే జట్లతో తలపడనున్నాయి ఒక్కో గ్రూప్ నుండీ రెండు జట్ల చొప్పున సూపర్4కు వెళతాయి ఈదశలో ఒక్కో జట్టూ మిగతా మూడు జట్లతో తలపడుతుంది. సూపర్ 4లో మొదటి రెండు స్థానాల్లో నిలిచినా జట్లు ఫైనల్ చేరతాయి.
రోహిత్ శర్మ, దోనిపైనే భారమంతా :
కెప్టెన్ గా ముందుండి నడిపించాల్సిన ఆటగాడు రోహిత్ శర్మపైనే జట్టు చాలా వరకూ ఆడారపడుతోంది. యూఏఈ ఎడారి ఎండల్లో సహనం కోల్పోకుండా చూసేందుకు ధోని కూడా ఉన్నాడు. అక్కడి సమస్యలను అధిగమించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వీరిద్దరి పాత్ర ప్రదానం కానుందని ‘సునీల్ గవాస్కర్’ అన్నారు.
భారత్ పాక్ ల మధ్య పోరు :
గతేడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ విజేతగా నిలిచిన పాక్ ఈ టోర్నీలో ఫేవరేట్ గా కనిపిస్తుంది పాక్ మాజీ కెప్టెన్ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నేపధ్యంలో ఈ కప్ ని కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే భారత్ పాకిస్థాన్ మధ్య పోరు మొత్తం టోర్నీకే హైలెట్ గా నిలవనుంది.
భారత్ – పాకిస్తాన్ జట్లు బుధవారం తలపడనున్నాయి దీనికి ముందు భారత్.. హాంకాంగ్తో తలపడనుంది. చివరిసారి టోర్నీలో పాక్ చేతిలో ఫైనల్లో ఓడిన భారత్ ఈ సారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఇదు గంటలకు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మద్య మొదటి మ్యాచ్ జరగనుంది.
షెడ్యూల్ వివరాలు :