శుక్రవారం, మార్చి 29, 2024
Homeటెక్నాలజీట్రూకాలర్ వాడుతున్నారా అయితే మీ డేటా గోవిందా

ట్రూకాలర్ వాడుతున్నారా అయితే మీ డేటా గోవిందా

రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది దీనిని వాడే మనిషికి  లాభం ఎంతవరకూ ఉందొ దానిని తప్పుగా ఉపయోగిస్తే దానివల్ల కలిగే నష్టం కూడా అంతే తీవ్రంగా కలిగిస్తుంది. నేడు సాదారణంగా అందరి మొబైల్స్ లో ట్రూకాలర్ యాప్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది.

ఎవరి మొబైల్ లో అయితే ట్రూకాలర్ ఉంటుందో వాళ్ళ ఫోన్ కి ఎవరైనా అవతలి వ్యక్తి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ఆ ట్రూకాలర్ యాప్ లో కనిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా దీనిపై చాలా మందికి నిపుణులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు  ట్రూకాలర్ యాప్ పనిచేసే విదానాన్ని తెలుసుకుందాం ఈ యాప్ ను డౌన్లోడ్ చేసిన తరువాత దాని వెబ్సైటు లో కొన్ని కన్దిసన్స్ ఇచ్చి వాటికి పర్మిస్సన్ ఇవ్వమని అడుగుతుంది. మనల్ని ముందుగా లాగ్ ఇన్ అవ్వమంటుంది.

మొబైల్ నెంబర్ గాని లేదా ఈమెయిలు అడ్రస్ ఎంటర్ చేసి లాగ్ ఇన్ అవుతాము అలా లాగిన్ అయిన తరువాత మనల్ని కొన్ని పర్మి సన్స్ అడుగుతుంది మనం అన్ని పర్మిసన్స్ టిక్ చేసి వాటి కన్డిసన్స్ కు అనుమతి ఇవ్వగానే మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వంటి మన డీటెయిల్స్ అన్నీ ఆ ట్రూకాలర్ యాప్ ద్వారా సర్వర్ కి లింక్ అయిపోతాయి.

అంతే కాకుండా మీ మొబైల్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఈ సర్వర్ కి లింక్ అయిపోతాయి అప్పటినుంచి మీ మొబైల్ డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి.truecaller image

ఈ ట్రూకాలర్ ను 2013 లో సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ అనే సంస్థ దీనిని హ్యాక్ చేసి ట్విట్టర్ ఎకౌంట్ లో డేటా మొత్తం పోస్ట్ చేసారు. ఈ ట్రూకాలర్ యాప్ పై జరిగిన హ్యాకింగ్ విషయాన్ని ట్రూకాలర్ సంస్థ అధికారికంగా కన్ఫార్మ్ చేసింది. దీనితో ట్రూకాలర్ యూ్జర్స్ ఇది అంత సేఫ్ కాదని, ఎప్పుడైనా హ్యాక్ అయ్యే అవకాసలున్నాయని గుర్తించారు.

గత కొంతకాలంగా కొంతమందికి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ స్పామ్ చేసి మీకు పలానా కంపెనీ నుండి లాటరీ తగిలిందని, ఆ డబ్బును మీకు పంపించాలంటే సర్వీస్ చార్జ్ కొరకు కొంత డబ్బును మాకు డిపాజిట్ చేయాలని లేదా మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే దానికి ఎమౌంట్ పంపిస్తామని అమాయకులకు గాలం వేసి తద్వారా ఆయా ఎకౌంట్ నుండి డబ్బు నొక్కేస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణ లో ఆధార్ వేలిముద్ర హ్యక్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాక ట్రూకాలర్ ద్వారా మహిళలపై అనేక వేదింపులు కొన్నాళ్లుగా చోటుచేసుకుంటున్నాయి.

ట్రూకాలర్ యాప్ వల్ల మీతోపాటు మీ స్నేహితులు ఎలాంటి తప్పు చేయకపోయినా మీ ఫ్రెండ్ వల్ల మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ట్రూ కాలర్ సర్వర్ లోకి వెళ్ళడం వల్ల మీకు కూడా ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ మరియు ఈమెయిల్స్ ఎక్కువగా వస్తాయి. ఈ ట్రూకాలర్ ను తప్పుగా వాడడం వల్ల అమాయకమైన, ఏవిధమైన సంభందం లేని వారికి సైతందీనివల్ల నష్టం కలుగుతుంది.

ఈ సమస్యలు ఎదుర్కునే వారిలో  ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు ఉండటం చాల విచారించదగ్గ విషయం. ఇలాంటి విషయాలు మీకు తెలిసిన ఎదల సైబర్ పోలీసు వారికి సమాచారం ఇవ్వడం ద్వారా అమాయకమైన ప్రజలను  దీని  బారినుండి రక్షించిన వారవుతారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular