Tokyo Olympics : అంగరంగ వైభవంగా మొదలైన టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్ లో మన తెలుగు తేజం పీవీ సింధు మొదటి మ్యాచ్ లోనే తన ప్రతిభ కనబరుస్తూ మొదటి విజయాన్ని అందుకుంది. గ్రూప్ జే తొలిమ్యాచ్ లో ఇజ్రాయెల్ క్రీడాకారిణి పై విజయం సాదించి శుభారంభం పలికింది.
మ్యాచ్ జరిగినంత సేపూ పూర్తి ఆదిపత్యంతో PV Sindhu కొనసాగింది. ఆడిన మొదటి సెట్ లోనే 21-7 తో ఆదిపత్యం సాదించిన సింధు రెండవ సెట్ లో 21-10 తో ఘనవిజయం సాదించింది. ఇజ్రాయెల్ కు చెందిన ప్రత్యర్ధి క్రీడాకారిణి కి ఎలాంట్ చాన్స్ ఇవ్వలేదు ఇక ఈ మ్యాచ్ మొత్తం అరగంట లోపే పీవీ సింధు ముగించిందంటే ఎంత సునాయాసంగా గెలిపొందిందో అర్ధం చేసుకోవచ్చు.
Read Also…Sri Lanka vs India దీపక్ చాహర్ మెరుపు ఇన్నింగ్స్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా