శుక్రవారం, జూలై 26, 2024
Homeఅంతర్జాతీయంచైనా కి కౌంటర్ గా బ్రహ్మోస్ ను రంగంలోకి దింపిన భారత్..!

చైనా కి కౌంటర్ గా బ్రహ్మోస్ ను రంగంలోకి దింపిన భారత్..!

కొన్నాళ్ళుగా చైనా ఒక వైపు బోర్డర్ లో మరో వైపు సౌత్ చైనా సముద్రంలో బారత్ ను రెచ్చగొట్టే విధంగా భారత్ కు వ్యతిరేకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే ప్రస్తుతం చైనా బారత్ ను మాత్రమే కాదు వాటి మిత్ర దేశాల సముద్ర జలాల్లోకి సైతం చోచ్చుకొచ్చి మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. చైనా చేస్తున్న నాటకాలకు తేరా తీసేందుకు ఇప్పుడు సౌత్ చైనా సముద్ర జలాల నుండి భారత్ జలాల వైపు చైనా దురాక్రమనను అడ్డుకునేందుకు భారత్ తన అమ్ములపోదిలోని బ్రహ్మోస్ మిస్సైల్ తో చైనా కు కౌంటర్ ఇచ్చే దిశగా వడి వడిగా అడుగులు వేస్తుంది.

అయితే భారత్ తో పాటు  చైనాకి వ్యతిరేకంగా ఉన్న సరిహద్దు దేశాలైన వియత్నాం, తైవాన్, మలేషియా, పిలిఫీన్స్, వంటి దేశాలుండగా భారత్ ప్రస్తుతం పిలిఫిన్స్ దేశానికి కోస్టల్ డిఫెన్స్ సిస్టంను పెంపొందించే విధంగా మరింత శత్రు దుర్బెద్యంగా మార్చడానికి, పిలిఫిన్స్ దేశాన్ని చైనా ఎటాక్ చేసేటప్పుడు యుద్ద విమానాల నుండి కాపాడడానికి భారత్ తన బ్రహ్మోస్ ను ఫిలిపిన్స్ కు తక్కువ ఖర్చుతోనే సప్లై చేయనుంది.

ఈ వ్యవహారంపై  ఇండియా విదేశీ వ్యవహారాల శాఖామంత్రి “జై దీప్ మజుందార్” ఇండియా మరియు పిలిఫీన్స్ మద్య త్వరలో డిఫెన్స్ డీల్స్ జరగబోతున్నవిషయాన్ని తెలిపారు. ప్రస్తుతం కరీనా ఎఫెక్ట్ తో ఇరు దేశాల మద్య విమానయాన సర్వీసులు రద్దు చేసినందువల్ల లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే రెండు దేశాల మద్య భారత్ నుండి కొనుగోలు చేసే పలు ఆయుదాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.

అయితే గత సంవత్సరం జరిగిన డిఫెన్స్ డీల్ చర్చల్లో భాగంగా వీటి ధరను సైతం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మార్చి నెలలో జరగాల్సిన ఈ చర్చలు సైతం కరోనా కారణంగా ఈ చర్చలకు ఆటంకం ఏర్పడింది. అయితే పిలిఫిన్స్ తో పాటు మరిన్నిదేశాలు  వియత్నాం, థాయిలాండ్ మరియు ఇండోనేసియా లాంటి భారత్ మిత్ర  దేశాలు ఇప్పుడు ఈ బ్రహ్మోస్  మిసైల్ ను సొంతం చేసుకునేటందుకు పలు మార్లు భారత్ తో చర్చలు ప్రారంభించాయి.

గత కొన్ని రోజుల క్రితం వియత్నాం  దేశానికి చెందినఒక  షిప్ ను చైనా నేవీ పేల్చి వేయడంతో చైనా పేరు చెబితేనే వియత్నాం రగిలిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు చైనా కన్ను ఆయా దేశాల భూబాగం, సముద్ర జలాలపై పడటంతో చైనా నుండి ఎలాగైనా వారి భూబాగాన్ని కాపాడుకోవాలని మరియు భారత్ మద్దతుతో చైనా కు కౌంటర్ ఇవ్వడానికి భారత్ వద్ద నుండి బ్రహ్మోస్ ను రంగంలోకి దింపాలని ఆయాదేశాలు చూస్తున్నాయి.

వెంటనే భారత్ నుండి పలు ఆయుధాల ఆయుదాల కొనుగోలుకు ఆసక్తి చూపాయి. అయితే పిలిఫిన్స్ బ్రహ్మోస్ మిస్సైల్ తీసుకోవడంతో పాటుగా దీనికి సాయంగా భారత్ పిలిఫిన్స్ కు  100 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఇష్యూ చేయనున్నట్లు తెలిపింది.

అయితే పిలిఫిన్స్ ఈ సంవత్సర బడ్జెట్ లో సైతం ఈ డీల్ అందులో పొందుపరచనున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు భారత్ సొంతంగా తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ సైతం కొనుగోలు చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం భారత్ తో ఈ డిఫెన్స్ డీల్స్ ప్రాణం పోసుకోవడానికి ముఖ్య కారణం 2017 లో ప్రదాని నరేంద్ర మోడీ విదేశీ యాత్రలో పిలిఫిన్స్ తో జరిగిన అనేక ఎంఓయు లు చేసుకున్నారు. ఈ ఎంఓయూ లు ఇప్పటికి కార్యరూపందాల్చాయి. ప్రస్తుతం రెండు దేశాలు లాజిస్టిక్ సపోర్ట్ మరియు డిఫెన్స్ సపోర్ట్ పై పలు సంతకాలు చేసుకున్నాయి.

దీనితో పాటు ఇండోనేషియా సైతం బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది. దీనికి కారణం ఇండోనేషియా ఎయిర్ ఫోర్సు యుద్ద విమానాలకు బ్రహ్మోస్ ను అనుసందానించాలని బావిస్తోంది. దీనికి భారత్ సైతం సాయం చేసి ఆయా యుద్దవిమానాల ద్వారా సూపెర్ సోనిక్ యాంటీ షిప్ క్రూజ్ మిస్సైల్ గా వాటిని మార్చడానికి ఇండోనేసియాకు సాయం చెయ్యాలని భారత్ యోచిస్తోంది.

ఒకవైపు నుండి స్నేహితుల కోసం సాయం చేసే దేశం ఒక వైపున ఉంటె.. మరోవైపు  చైనా నేపాల్ ని ఉసిగొల్పి భారత్పైకి వ్యతిరేకంగా పంపుతుంటే ప్రదాని మోడీ చైనా చుట్టూ బ్రహ్మోస్ ను టార్గెట్ చేసి పెడుతుండటం మోడీ గారి విదేశీ దౌత్యం పూర్తి స్థాయిలో సఫలం అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular