గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeసినిమాకాలు దువ్వుతున్న ‘పందెంకోడి 2’

కాలు దువ్వుతున్న ‘పందెంకోడి 2’

మాస్ హీరో విశాల్ 15 ఏళ్ల క్రితం చేసిన మూవీ పందెంకోడి అప్పట్లో ఈ చిత్రంతో విశాల్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విశాల్ కి తెలుగు, తమిళ్ రెండు బాషల్లోనూ మార్కెట్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడు దీనికి సీక్వెల్ గా పందెంకోడి 2 తెరకెక్కుతోంది తమిళం లో ఈ సినిమా సంధకోలి 2 పేరుతో విడుదల కానుంది. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కధానాయికగా నటిస్తుంది. విశాల్ మాజీ లవర్ వరలక్షి లేడీ విలన్ గా కనిపించనుంది.

యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్ పై విశాల్, ధావల్ జయన్తిలాల్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలెర్ తెలుగు వెర్షన్ విడుదల చేసారు ఇది ఇప్పుది సోషల్ మీడియాలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది.

మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’ చిత్రాన్ని విజయ దశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే విశాల్ మాస్ మేకోవర్ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇక కీర్తి సురేష్ తన గ్లామర్ తో మెప్పించింది. ఇక లేడీ విలన్ గా వరలక్ష్మీ లుక్ అదిరిపోయింది. ట్రైలెర్ చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం పందెంకోడి లాగానే మంచి విజయాన్ని సాదిస్తుందని అంటున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular