బుధవారం, జూలై 17, 2024
Homeఅంతర్జాతీయంకరోనా విశ్వరూపం ఇలా ఉంది చూస్తే షాక్ అవుతారు

కరోనా విశ్వరూపం ఇలా ఉంది చూస్తే షాక్ అవుతారు

విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని వైరస్ చుట్టేస్తోంది. దీని వల్ల అభివ్రుద్ధి చెందిన దేశాలు కూడా విలవిలలాడిపోతున్నాయ్. ఎక్కడ చూసినా కరోనా కరోనా ఈ పేరు ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పది లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 50 వేలకు పైగా జనం ఉసురుకోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా లెక్కలు ఇలా ఉన్నాయి.

 ఇప్పటివరకూ  ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నమోదైన కరోనా కేసులు అంతేకాక మరణాల వివరాలు

 • అమెరికాలో శుక్రవారం నమోదైన కేసులు 20,429 కాగా మొత్తం కేసులు 2,65,306. ఇక మరణాల విషయానికొస్తే 6,774 మంది దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు.
 • ఇటలీలో శుక్రవారం ఒక్క రోజే 4,585 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,19,827. ఇక మరణాల విషయానికొస్తే 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు.
 • స్పెయిన్ లో శుక్రవారం 5645 మొత్తం అక్కడి కేసుల సంఖ్య 1,17,710 ఇక మరణాల విషయానికొస్తే 10,935 మంది ప్రాణాలని కరోనా వైరస్ హరించేసింది.
 • జర్మనీలో శుక్రవారం 5044 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 89,838. మరణాల సంఖ్య 1230
 • చైనా లో శుక్రవారం తక్కువగా 31 కేసులు నమోదుకాగా మొత్తం అక్కడి కేసుల సంఖ్య 81,620. మరణాలు 3322
 • ఇరాన్ లో శుక్రవారం 2715 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 53,183. మరణాల సంఖ్య 3,294.
 • బ్రిటన్ లో శుక్రవారం 4,450. మొత్తం కేసుల సంఖ్య 38,168. మరణాలు 3,605.
 • స్విజర్ ల్యాండ్ లో శుక్రవారం నమోదైన కేసుల సంఖ్య 779. మొత్తం కేసులు 19,606. మరణాలు 591.
 • బెల్జియం లో శుక్రవారం కేసుల సంఖ్య 1422. మొత్తం కేసులు 16,770. మరణాలు 1143.
 • నెదర్లాండ్ లో శుక్రవారం నమోదైన కేసులు 1026. మొత్తం కేసులు 15732. ప్రాణాలు పోయినవారి సంఖ్య 1487.
 • భారత్ లో శుక్రవారం నమోదైన కేసులు 226. మొత్తం కేసులు 2567. మరణాలు 72.

ఇక ప్రపంచం మొత్తం మీద శుక్రవారం నమోదైన కేసులను చూస్తే 58,988. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 10,74,053. మొత్తం ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 56,975. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ ప్రపంచదేశాల్లో ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయ్. ఓ వైపు పాజిటీవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి మరోవైపు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కొవిడ్ 19 కి మందు లేదు. కేవలం స్వీయ నిర్భందం మాత్రమే దీనికి మందు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular