శుక్రవారం, జూలై 26, 2024
Homeజాతీయంఏప్రిల్ 14 తర్వాత మోడీ ఎటు మొగ్గు చూపనున్నారు..?

ఏప్రిల్ 14 తర్వాత మోడీ ఎటు మొగ్గు చూపనున్నారు..?

ఒక పక్క కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది.  ఈ నేపథ్యంలో మార్చి 24 నుంచి  21 రోజులపాటు యావత్ భారతదేశం లాక్ డౌన్ విధించారు ప్రధాని మోడీ అయితే లాక్ డౌన్ విధించినప్పుడు పరిస్థితి ఇప్పటి పరిస్థితి పుర్తిగా భిన్నంగా ఉన్నాయ్. 21 రోజుల లాక్ డౌన్ తో కరోనా వ్యాప్తి అనేది తగ్గుతుందని అనుకున్నారంతా అయితే అనుకున్నట్టు వ్యాప్తి తగ్గినట్టే తగ్గి నిజాముద్దీన్ సంఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది..

ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా రాష్టాల ముఖ్యమంత్రులు రూల్స్ ని కట్టుదిట్టం చేశారు. లాక్ డౌన్ పొడిగించాలనే ఒక నిర్ణయానికి రానేవచ్చారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు లాక్ డౌన్ ని ఏప్రిల్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయాలు తీసేసుకున్నాయ్.

దీనికి కారణం  దేశంలో కరోనా కేసులు 8,447 కి  చేరుకుని హడలెత్తిస్తుండటం.. మరోవైపు ప్రధాని మోడీ కూడా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చుంటారని, ప్రధానికూడా లాక్ డౌన్ పొడిగింపుపైనే మొగ్గుచూపుతారని విశ్లేషకుల అంటున్నమాట.

దీనికి కారణం లేకపోలేదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు మెజారిటీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ దేశానికి సవాళ్లు లేకపోలేదు 21 రోజుల లాక్ డౌన్ దెబ్బకి ఇప్పటికే ఆర్ధికవ్యవస్థ దెబ్బతింది.

ఇక మరిన్ని రోజులు పొడిగింపు అంటే అది ఆర్ధిక వ్యవస్థపై మరింత ప్రభావాన్ని చూపడం ఖాయం. కానీ ప్రధాని మోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదిశగా మొదటినుంచి అడుగులు వేస్తూ వస్తున్నారు.

కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ పొడిగింపు పైనే అయన నిర్ణయం ఉంటుందని ఒక అంచనా. ఎందుకంటే  ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక ముందు ప్రాణాలు భద్రంగా ఉండేదిశగా బిజెపి ప్రభుత్వం అడుగులు వేయనుందని తెలుస్తోంది.

ఇది ఒకందుకు మంచి పరిణామమే ఎందుకంటే ఇప్పుడు కరోనా నిర్మూలనకి లాక్ డౌన్ ఒక సంజీవని లాంటిదని తెలిసిందే. అందుకే ఒకవైపు ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలోపెట్టే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ అడుగులు పడుతున్నాయ్..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular