ఆదివారం, మే 26, 2024
Homeరాజకీయంకూతురు ప్రేమించిందని అన్నంలో విషం పెట్టిన తల్లిదండ్రులు

కూతురు ప్రేమించిందని అన్నంలో విషం పెట్టిన తల్లిదండ్రులు

ఇంత ఆధునిక యుగంలో రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా పాతకాలపు పరువు హత్యలు ఇంకా ప్రతీ రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మాలేగావ్ లో పరువు హత్య జరిగింది. వేరేకులం అబ్బాయిని ప్రేమించిన కారణంగా కన్న తండ్రి తన స్నేహితులతో కలిసి పరువు హత్య చేసాడు.

కుమార్తెకు అన్నంలో విషం కలిపి పెట్టాడు. విషం కలిపిన భోజన తినడంతో కుమార్తె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత తన శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా స్మాసానంలో పాతిపెట్టడానికి తీసుకువెళ్లగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ పరువు హత్య వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాలప్రకారం మహారాష్ట్రలోని మాలేగాం పట్టణంలో ఇంద్రాణీ కాలనీకి చెందిన నేహ 12వ తరగతి చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కొన్నాళ్ళగా ప్రేమిస్తోంది అయితే ఇటీవల ఆమె తన పుట్టినరోజు వేడుకలకు తను ప్రేమించిన అబ్బాయితో శివారు ప్రాంతానికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నేహాపై తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

తరువాత కుమార్తెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారం పెట్టారు. భోజనం తిన్న నేహా స్పృహ కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను హతమార్చ్చారు. శవాన్ని పూడ్చేందుకు స్మశానానికి తీసుకువెళ్ళారు.

ఈ హత్య గురించి గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు నేహా మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం చేయించగా హత్య అని తేలడం, నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో తల్లిదండ్రులతో సహా దీనికి సహకరించిన స్నేహితున్ని కూడా అరెస్టు చేసారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular