శనివారం, జూలై 20, 2024
Homeరాజకీయంఆనంద ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు : చంద్రబాబు

ఆనంద ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు : చంద్రబాబు

శ్రీకాకుళం : మనం ఇంత స్వేఛ్చగా జీవించగాలుగుతున్నామంటే దీనికి ప్రదాన కారణం ఎందరో మహానుబావుల త్యాగఫలంతోనే స్వాతంత్ర్యం వచ్చిందని స్వాతంత్ర్య కాంక్ష కోసం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారాయన. తరువాత రాష్ట్రవ్యాప్తంగా అనేక విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు అందచేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఒక్కోక్క జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలియ జేశారు. మొదటి నాలుగుసంవత్సరాల్లో కర్నూలు, విశాక , అనంతపురం మరియు తిరుపతి వంటి నగరాలలో ఈ వేడుకలు  నిర్వహించామని అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో జాతీయ జెండారెపరెపలాడేలా పండుగా జరుపుకుంటున్నామన్నారు.

క్రీకాకుళం జిల్లా అనేది ఎందరో గోప్పనేతలకు నిలయంగా నిలిచిందని అన్నారు. అంతేకాక 2029 సంవత్సరానికల్లా ఆంద్రప్రదేశ్ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలబడుతుందని అన్నారు. తాము ప్రభుత్వంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రం రెండంకెల వృద్ది సాదించాలానే సంకల్ప బలం ఉంటె ప్రపంచంలో ఏదైనా సాదించగలమన్నారు.

తాము రైతులపై ప్రత్యెక శ్రద్ద చూపిస్తున్నామన్నారు. వ్యవసాయంపై ప్రత్యెక ద్రుష్టి పెట్టి వరి దిగిబడి అధికంగా పెంచామన్నారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే రైతులకు రూ. 24,500 కోట్ల రుణవిముక్తి చేసామన్నారు. రాష్ట్రంలో ప్రజలు అందరూ ఆనందంగా సుఖ సంతోసాలతో ఉండేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రం ఆనందప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular