చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల రాళ్ళదాడి

0
919
chandrababu
chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటివద్ద పరిస్థితి రణరంగం లా మారింది నిన్న టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ కి పరిపాలించడం రాదంటూ రాష్ట్రం ఇలా తయారవ్వడానికి జగనే కారణమంటూ జగన్ పై విమర్శలు చేసారు. దీనితో వైసీపీ ఎమెల్యే జోగి రమేష్ కొందరు కార్యకర్తలను వెంటపెట్టుకుని నిరసన తెలుపుతున్నామంటూ చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించి రాళ్ళు, కర్రలతో చంద్రబాబు ఇంటిపైకి విసిరారు.

ఇంతలో అక్కడకి చేరుకున్న బుద్దావెంకన్న, పట్టాభి తో పాటు టీడీపీ నేతలు మరియు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో బుద్దావెంకన్న మరియు జోగిరమేష్ ల మద్య చాలా సేపు మాటల యుద్ధం కొనసాగింది. ఇంతలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, జెండా కర్రలతో టీడీపీ నేతలపై విసరడంతో అక్కడున్నవారికి గాయాలయ్యాయి. వైసీపీ నేతలు అక్కడకు వచ్చి గంట సేపైనా వారిని అక్కడి నుండి పంపించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

వైసీపీ గూండాలు తమ నేత ఇంటిమీద దాడి చేస్తుంటే డీజీపీ ఏమిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్ళు విసరడంతో అక్కడే వున్న ఈటీవి కి చెందిన కెమెరా మేన్ కు తలకు గాయమైంది. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై రాళ్ళు విసురుతుంటే వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలపై లాతీచార్జ్ చేయడంతో పోలీసుల తీరుపై మండిపడుతూ వెంటనే జోగి రమేష్, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో జోగి రమేష్ ను అరెస్ట్ చేసారు పోలీసులు.     

WhatsApp Group Join Now