శనివారం, జూలై 20, 2024
Homeఅంతర్జాతీయంఅగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ ... మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

డీఆర్డీవో మరియు భారత్ డైనమిక్ లిమిటెడ్ సంయుక్తంగా అబివృద్ది చేసిన అగ్ని-5 మిసైల్ ను బుధవారం ఒడిస్సా లోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి భారత్ ప్రయోగించింది. అగ్ని సిరీస్ లో ఇది ఐదవ మిసైల్  5000 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం కచ్చితత్వంతో చేదించగలదు ఈ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరిధిలోకి పాకిస్థాన్  మొత్తం తో పాటు చైనా లోని ప్రధాన నగరాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఇప్పటికే అగ్ని-1 నుండి అగ్ని-4 వరకూ అనేక మార్లు ప్రయోగించగా ప్రతీ టెస్ట్ లోనూ అగ్ని మిసైల్ తన ఛత్తా చాటింది నేడు అగ్ని-5 సక్సెస్ తో భారత రక్షణరంగానికి మరింత భలం చేకూరినటైంది. ఇదిలా ఉండగా చైనా తన హైపర్ సోనిక్ మిసైల్ ను కొద్దు రోజుల క్రితమే ప్రయోగించింది అయితే ఈ హైపర్ సోనిక్ మిసైల్ లక్ష్యానికి 30కిలోమీటర్ల దూరంలో పడింది.

దీనితో చైనా ఈ మిసైల్ ను అబివృద్ది చేసే పనిలో పడింది. చైనా హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగించిన కొద్ది రోజుల్లోనే భారత్ అగ్ని-5 మిసైల్ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో చైనాకు గుబులు మొదలైంది ఎందుకంటే అగ్ని-5 మిసైల్ రేంజ్ 5000 కిలోమీటర్లని అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా దాని రేంజ్ 8000 కిలోమీటర్ల వరకూ ఉంటుందని చైనా రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు ఇదే నిజమైతే చైనా మొత్తం ఈ మిసైల్ పరిధిలోకి వస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular