యూవీ మామా లేటుగా ఇచ్చినా సూపర్ సాంగ్ ఇచ్చావ్…ప్రభాస్ ఫ్యాన్స్

0
1047
Radhe Shyam Lyrical Video Song
Radhe Shyam Lyrical Video Song

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీలవర్స్ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన టైం రానే వచ్చింది. అప్డేట్స్ విషయంలో అసలే యూవీ క్రియేషన్ పై కడుపు మంటతో రగిలిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ను మరోసారి వాళ్ళ కోపాన్ని పరీక్షించింది యూవీ సంస్థ. నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు రాధేశ్యామ్ నుండి ఫస్ట్ లిరికల్ వీడియో విడుదల చేస్తున్నామంటూ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ సాయంత్రం 5 దాటుతున్నా టెక్నికల్ ప్రాబ్లం తో అప్డేట్ ఇవ్వకపోవడంతో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ ను చిత్రయూనిట్ నిరాశపరిచింది.

Read Also: ఇండియాలో ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని భారీ యాక్షన్ సీన్స్ తో సలార్

అయితే చాలాసేపటి తర్వాతా రాధేశ్యామ్ నుండి ఫస్ట్ లిరికల్ వీడియో రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుషీగా అయ్యారు. ఇక ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే ఈ రాతలే అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. అయితే ఈ సాంగ్ లో ప్రభాస్ మరియు పూజా హెగ్డే లను చూపిస్తారనుకున్నారంతా కాకపోతే వీరి లుక్ ని ఈ సాంగ్ లో ఎక్కడా కొంచెం సేపు కూడా రివీల్ చెయ్యకుండా లిరికల్ సాంగ్ కాబెట్టి కార్టూన్ టైప్ గ్రాఫిక్స్ తో తీసుకువచ్చారు.

ఇక ఈ సాంగ్ లో సినిమాకు సంబందించి కొన్ని క్లూస్ ఇచ్చారు వాటిలో సాంగ్ మద్యలో వచ్చే సేతాస్కోప్ చూపిస్తూ పూజా హెగ్డే ఈ సినిమాలో డాక్టర్ కేరెక్టర్ లో ఉంటుందనే క్లూ ఇచ్చారు. అంతే కాక ఈ సాంగ్ లిరిక్స్ లో కూడా సినిమా స్టోరీ చాలా వరకూ బయటపెట్టారు. ఏదేమైనా అద్భుతమైన లిరిక్స్ తో సినీ లవర్స్ ను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Read Also: అమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

ఇక ఈ సినిమా ఒక్క జన్మతో కాకుండా అనేక జన్మల పేమ కథగా రాధే శ్యామ్ ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన లిరిక్స్ ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది రాధేశ్యామ్. యూవీ మామా లేటుగా ఇచ్చినా సూపర్ సాంగ్ ఇచ్చావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ సంస్థపై కామెంట్స్ చేస్తున్నారు.

  

 

 

 

 

WhatsApp Group Join Now