మీ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు…చంద్రబాబు గారి అంగీకారం ఇక అవసరం లేదు ..బాలకృష్ణ

0
1105
Nandamuri Balakrishna press meet
Nandamuri Balakrishna press meet

నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద జరిగిన మాటల దాడితో రాష్ట్ర ప్రజానీకంతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు అధికార పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనతో ఏపీ వ్యాప్తంగా మహిలలు వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఈ ఘటనపై పుందేశ్వరి మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు.

తాజాగా నేడు నందమూరి కుటుంభ సభులు మొత్తం మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన పరిణామం చాలా బాదాకరమని అన్నారు రాష్ట్ర అబివృద్ది కోసం జరగాల్సిన అసెంబ్లీలో అసలు విషయాన్ని డైవర్ట్ చేసి అదే ఎజెండాగా ఒకరి కేరెక్టర్ పై మాట్లాడారని అన్నారు.

ఇప్పటివరకూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేదని, తెలుగుదేశం ఎప్పుడూ ఒక ఇష్యూ మీద పోట్ల్లడుతుందని అది రామారావు గాని నుండే వచ్చిందన్నారు అలాంటిది నా చెల్లెలు భువనేశ్వరి గారి మీద మాట్లాడిన మాటలు చాలా దురద్రుష్టమన్నారు. వైసీపీ నాయకుల పద్ధతి, మాటలు, వారి బాడీలాంగ్వేజ్ చూస్తే గొడ్ల చావిట్లో ఉన్నామా లేక అసెంబ్లీలో ఉన్నామో అనుమానంగా ఉందన్నారు.  

ఇకపై ఇది మా సంస్కృతి కాదు..మా సంస్కారం కాదు అంటూ చేతులు కట్టుకు కుర్చోమంటూ మీరు అసులు మనుషులే కాదు మీరు ఇక మారరంటూ మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తామన్నారు. వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు గారితో నేను ముందే చెప్పానని ఆయన మమ్మల్ని సహనంగా ఉండమన్నారని తెలిపారు.

వైసీపీ వాళ్ళు విర్రవీగి ఇష్టమొచ్చినట్లు మాట్లడితే ఇకపై సహించమని, నోరు అదుపులో పెట్టుకుని ఇకపై మాట్లాడాలని తెలిపారు అంతేకాక ఇకపై చంద్రబాబు గారి అనుమతి అవసరం లేదని ఇప్పటివరకూ మేము సహనంగా ఉన్నామంటే అది ఆయనవల్లేనని, ఇకపై నోటినుంచి ఒక్క మాట మా ఇంటి మహిళలపై వస్తే మీరు ఎక్కడున్నా మీకు గుణపాటం చెబుతామన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే జాతీయ మీడియా ఈ విషయాన్ని కవర్ జేయడంతో వైసీపీ నిర్వాకం చూసి జనం రాష్ట్ర పరిస్థితులపై సిగ్గుపడుతూ పలువురు జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టులు ఈ ఘటనను ఖండిస్తూ ఏపీలో మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసారు.

Read Also: 1. కుప్పంలో దొంగ ఓటర్ల అరాచకం..రంగంలోకి చంద్రబాబు

2.  అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

                3.  అఖండ ట్రైలర్ తో రికార్డుల ఊచకోతకు బాలయ్య ఫ్యాన్స్ | Akhanda Trailer

 

WhatsApp Group Join Now