కుప్పంలో దొంగ ఓటర్ల అరాచకం..రంగంలోకి చంద్రబాబు

0
952
Kuppam Municipal Election
Kuppam Municipal Election

నేడు కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నిక రసాబాసగా మారింది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో పోలింగ్ ఉదయం నుండే మొదలవ్వగా మొదలైన కొద్ది సేపటికే దొంగ ఓటర్లు పలు పోలింగ్ బూత్ లకు చేరుకోగా వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన దొంగ వోటర్లను ఐడీ కార్డులు చూపించమనడంతో వారు నిరాకరించి అక్కడినుంచి తప్పించుకున్నారు.

Read More: అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

ఇదిలా ఉండగా పలుచోట్ల పోలీసులు టీడీపీ కి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్ లను పలు కారణాలు చెప్పి అరెస్టు చేసారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చంద్రబాబు కుప్పం బయలు దేరారు. తమ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్ లను కరెక్టుగా ఎన్నిక జరుగుతున్న టైం లోనే వారిని అరెస్టు చేసి ఆయా బూత్ లలో టీడీపీ కి చెందిన బూత్ ఏజెంట్లు లేకుండా పక్కా ప్లాన్ తో అరాచకంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

Read More: అఖండ ట్రైలర్ తో రికార్డుల ఊచకోతకు బాలయ్య ఫ్యాన్స్ | Akhanda Trailer

విచ్చలవిడిగా దొంగ వోటర్లు పోలింగ్ బూత్ లకు వస్తున్నా పోలీసులు వారిని ఆపడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దొంగ వోటర్లను మేము అడ్డుకుంటుంటే మమ్మల్ని అరెస్టు చేస్తునారన్నారు. కుప్పంలో వైసీపీ అరాచకం సృష్టిస్తుందని, ఒక్క ఎలక్షన్ లో కూడా న్యాయంగా గెలిచే సత్తా వైసీపీకి లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తునారు.      

WhatsApp Group Join Now