అఖండ ట్రైలర్ తో రికార్డుల ఊచకోతకు బాలయ్య ఫ్యాన్స్ | Akhanda Trailer

0
449
Akhanda movie trailer update
Akhanda movie trailer update

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రేస్టేజియస్ ఫిల్మ్ అఖండ. బాలయ్య మరియు బోయపాటి అంటేనే అదొక సూపర్ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే అఖండ టీజర్ యూట్యూబ్ లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే అయితే తాజాగా చిత్ర యూనిట్ అఖండ నుండి ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 07:09 నిమిషాలకు విడుదల చెయ్యనున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కు సంబందించి ఇప్పటికే పలు డెట్లు ఇచ్చి వాటిని వాయిదా వేస్తున్నారు. ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తైనా చాలా రోజులనుండీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read Also: అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

ఈ రోజు విడిదల చెయ్యబోయే ట్రైలర్ లో రిలీజ్ డేట్ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య AHA వేదికగా Unstoppable షోలో డాన్స్లు, డైలాగులతో అలరిస్తుండడం తో ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారు.

Read Alsoఅమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

ఇక ఈ సినిమాకు సంబందిచి బిజినెస్ బాలయ్య మునుపటి సినిమాలతో పోలిస్తే ఇప్పటివరకూ ఎవరూ ఊహించని స్థాయిలో జరుగుతుంది. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యకుండానే 20 కోట్లకు నిజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫస్ట్ రోజు మంచి టాక్ వస్తే మొదటి వారం లోనే ఈ సినిమాకు 100కోట్లు ఈజీగా వస్తాయనే ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏదేమైనా అఖండ ట్రైలర్ తో బాలయ్య ఫ్యాన్స్ రాచ్చతో యూట్యూబ్ లో చాలా రికార్డులు ఈ దెబ్బతో పటాపంచలు అవుతాయి.

                               Akhanda Trailer Roar