అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

0
1059
latest amaravati news
latest amaravati news

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి సాధనకు రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానంవరకూ మహాపాదయాత్ర సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత అనిచివేయ్యాలని చూసినా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ 12వ రోజుకు చేరుకుంది. రాజధాని రైతులకు బ్రహ్మరధం పడుతూ దారి పొడువునా ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారు.

అయితే ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు మాత్రం ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోవట్లేదు. దీనిలో బాగంగానే మీడియాపై ఆంక్షలు పెడుతూ ఈ పోరాటాన్ని రాజధాని ప్రాంతానికే పరిమితం చేసి ఉద్యమాన్ని నీరుగార్చాలనే చూస్తున్నారు. నేడు కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంగించారనే పేరుతో పాదయాత్ర చేస్తున్న రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Read Also: అమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

ఇక అమరావతి సాధన ఉద్యమంలో మొదటినుంచీ  మహిళళే ముందుండి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అలాంటి మహిళలపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు ఇప్పటికీ ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం అమరావతి మహిళలు కట్టుకునే దుస్తులపై కామెంట్ చేసిన పేటీయం బ్యాచ్ తాజాగా రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో పాల్గొన్న మహిళా డాక్టర్లపై సోషల్ మీడియాలో అదే పేటీయం బ్యాచ్ మళ్ళీ విష ప్రచారం మొదలు పెడుతూ ఆ మహిళలను వీళ్ళు రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వారిపై మరియు అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

Read Also: అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

ఏదేమైనా అమరావతి అజరామరంగా ఎప్పటికీ నిలుస్తుందనడంలో సందేహంలేదు. ఈరోజు అమరావతి పూర్తి కాకపోవచ్చు అతిత్వరలోనే ప్రపంచం మెచ్చే రాజధానిగా వెలుగొందుతుంది. ఇప్పుడు రైతులపై కారుకూతలు కూసినవారు అదే రాజధానికి చరిత్ర హీనుల జాబితాలో ఎప్పటికీ నిలిచే ఉంటారు.      

WhatsApp Group Join Now