అమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

0
1194
defence news in telugu
defence news in telugu

భారత్ మరియు చైనా ఇరుదేశాలు ఇప్పటికే లద్దాక్ లో సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బోర్డర్ సమీపంలో భారీ స్థాయిలో టెంట్లు, ఆర్మ్డ్ వెహికల్స్, హెలికాఫ్టర్ లతో చైనా తన దురాక్రమణ ధోరణి ప్రదర్శిస్తుంది. దీనికి తగ్గట్టుగానే భారత్ చైనాకు తగిన గునపాటం చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పటికే లద్దాక్ బోర్డర్ లో సర్వీలియన్స్ పెంచుతూనే చైనాకు దీటుగా హోవిట్జర్ (శతఘ్నులు) లతో పాటు యుద్ద ట్యాంక్ లను మోహరించింది.  

అయితే చైనా నుండి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్దమౌతుంది దీనిలో ప్రధానంగా చైనాకు చెందిన J-20 అయిదవ తరానికి (5th Generation) చెందిన యుద్ద విమానాలతో భారత్ కు ముప్పు పొంచిఉన్న నేపద్యంలో భారత్ J-20 యుద్దవిమానాలను నిలువరించేదుకు సరికొత్త ప్రణాలికలు రచిస్తోంది.

దీనిలో బాగంగానే యూఎస్, యూకే దేశాలతో భారత్ గత కొద్దిరోజులుగా యుద్ద విన్యాసాలలో పాలుపంచుకుని మన దేశ యుద్ద విమానాలు యూఎస్, యూకే కి చెందిన  అయిదవ తరానికి (5th Generation) కి చెందిన యుద్ద విమానాలతో కలిసి అదే స్థాయిలో విన్యాసాలు చేయడంతో పలు దేశాలు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఇప్పటివరకూ భారత్ వాడుతున్న చాలా వరకూ యుద్ధవిమానాలు రెండవ తరం యుద్దవిమానాలనుండి 4.5 తరం యుద్ద విమానాల వరకూ వాడుతోంది.

అయితే తాజాగా ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన రాఫెల్ కూడా 4.5 తరానికి చెందిన యుద్దవిమానమే అయితే ఇప్పటివరకూ భారత్ వద్ద ఐదవ తరం యుద్ద విమానాలు లేకపోవడంతో చైనా కు చెందిన ఐదవ తరం యుద్దవిమానాలనుండి ఏర్పడే సవాళ్ళను ఎదుర్కొని ముందుగానే భారత్ తన వ్యూహ రచనకు పదును పెడుతోంది.

ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే తాజాగా యూఎస్, యూకే తో యుద్ద విన్యాసాలలో భాగంగా భారత్ అమెరికాకు చెందిన F-35 అయిదవతరం యుద్దవిమానాన్ని భారత వాయుసేనకు చెందిన పైలేట్స్ నడిపి అమెరికా వాయుసేన అధికారులను ఆశ్చర్యపరిచారు.

దీనికి సంబందించి అమెరికా వాయుసేన పైలేట్స్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ భారత్ వాయుసేన పైలేట్స్ F-35 యుద్దవిమానాన్ని ప్రోఫెసనల్ గా చాలా అద్భుతంగా నడిపారంటూ కితాబిచ్చారు. ఏదేమైనా భారత్ తన రణ క్షేత్రంలో ఎదుర్కొనే సవాళ్ళను ముందుగానే పసిగట్టి ఏదేశమైనా భారత్ కు స్నేహపూర్వకంగా మెలగాలేతప్ప భారత్ వైపు తోక జాడిస్తే కత్తిరిస్తామని ఇండైరేక్ట్ గా సందేశమిచ్చింది.

Read also : 

  1. అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు
  2. భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు          

 

WhatsApp Group Join Now