కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూత

0
451
puneeth rajkumar
puneeth rajkumar

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి గుండెపోటు రావడంతో ఆయన్ని బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్ కు తరలించారు కుటుంభ సభ్యులు. అయితే పునీత్ రాజ్ కుమార్ ను తీసుకు వెళ్ళే సరికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ విక్రమ్ హాస్పటల్ వైద్యులు తెలిపడంతో కుటుంభ సభ్యులతో పాటు చిత్ర కన్నడ చిత్ర పరిశ్రమలో  విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే పునీత్ రాజ్ కుమార్ కు నిన్న రాత్రి కూడా ఇదే విధంగా గుండెల్లో నొప్పితో బాధ పడినట్లు తెలుస్తోంది అయితే హాస్పటల్ కు వెళ్దామని కుటుంభ సభ్యులు చెప్పినా అంత సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈ రోజు ఉదయం తను జిమ్ లో వర్క్అవుట్స్ చేస్తుండగా మరోసారి గుండెల్లో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే హాస్పటల్ కు తరలించారు. అయితే అనదికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారని ఇంకా హాస్పటల్ వారు అధికారికంగా తెలపాల్సి ఉందని తెలుస్తోంది.

దీనితో బెంగుళూరు లోని సినిమాహాల్స్, చాలా వరకూ స్కూల్స్ ను మూసివేశారు. ఈ వార్త తెలుసుకున్న పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఒక్క సారిగా భారీ ఎత్తున విక్రమ్ హాస్పటల్ కు వచ్చి బోరున విలపిస్తున్నారు. శాండల్ వుడ్ లో తనకంటూ ఒక స్థానాని ఏర్పరచుకున్న పునీత్ రాజ్ కుమార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 46 వయస్సులోనే ఆయన మరణం కుటుంభ సభ్యులతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ ద్రిగ్బ్రాంతి చెందింది.