మా ఇంటిపై నిఘా పెట్టారు… నాకు ప్రాణహాని ఉంది.. వైఎస్ సునీత

0
980
ys sunitha reddy
ys sunitha reddy

వైఎస్ వివేకానంద రెడ్డి మరణం తరువాత చాలా రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు చాలానే మారుతున్నాయి. వివేకా మరణానంతరం ముందుగా సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  దీనితో వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ పిర్యాదు చేయడంతో అప్పటి సీయం చంద్రబాబు సిట్ వేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నాళ్ళు చూసినా సిట్ అధికారులు పెద్దగా పురోగతి సాదించకపోవడంతో వైఎస్ సునీత  కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు సీబీఐ కి అప్పగించింది.

అయితే ఈ కేసు విషయంపై కేంద్రపెద్దలతో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపారు వైఎస్ సునీత. అయితే సీబీఐ గత కొద్దిరోజులుగా ఈ కేస్ పై ఫుల్ స్పీడ్ పెంచింది. సునీల్ యాదవ్ ను విచారించిన తరువాత ఇప్పుడు సీబీఐ అధికారులు పలువురికి నోటీసిలు పంపించింది. ఒకవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత రాత్రి సమయంలో మా ఇంటి చుట్టూ ఒకరు రెక్కీ నిర్వహించి వెళ్ళాడని తెలిపారు.

అతనిపై నాకు అనుమానంగా ఉందంటూ పులివెందుల సీఐ కి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలతో సహా లేఖలో అనేక అంశాలను తెలిపారు. తాను గుర్తు పట్టినవ్యక్తి శివశంకర్ రెడ్డి పుట్టినరోజు నాడు వేయించుకున్న ప్లేక్సీలో అతను ఉన్నాడని  అంతే కాక నేను ఎప్పటినుంచో అనుమానిస్తున్న వ్యక్తి అంటూ నాకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు లేఖలో తెలిపారు.

ఇక సీబీఐ విచారణ మొత్తం పులివెందుల వైఎస్ ఫ్యామిలీ చుట్టూ కొనసాగుతుంది. ఆఫ్యామిలీకి చెందిన సన్నిహితులని విచారించిన సీబీఐ నేడు ఈకేసు తీవ్రత సీఎం క్యాంప్ ఆఫీస్ వరకూ చేరింది. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్ కోఆర్డినేటర్ కు నోటీసులు ఇవ్వడంతో నేడు సీబీఐ అధికారులు R & B గెస్ట్ హౌస్ లో రఘునాధరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

 

    

 

WhatsApp Group Join Now