బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయంమధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

మధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి విందు ఇచ్చాడు ఆ విందులో పాల్గొన్నవారిలో 10 మందికి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో ఇప్పుడు మళ్ళీ  కలకలం రేగింది ప్రస్తుతం ఆ విందులో పాల్గొన్న వారిని అలాగే వాళ్ళు సన్నిహితంగా మెలిగినవారిని కలిపి ఏకంగా 25000 మందిని కోరెంటెన్లో ఉంచారు.

మధ్యప్రదేశ్ లోనే మూరేనా నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఒక హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు ఈ మధ్య వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇక్కడికి వచ్చాడు సంప్రదాయంలో భాగంగా 1200 మందికి విందు ఇవ్వడం జరిగింది. అయితే ఆటను దుబాయ్ నుంచి వచ్చిన వివరాలు ఆటను పోలీసులకు అంతకుముందు తెలియనీయలేదు.

20 వ తేదీన విందు ఇచ్చాక 27 న తనకు తన భార్యకు అస్వస్థతగా ఉండటం తో హాస్పిటల్ కి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని ఆరాతీయగా అప్పుడు అసలు నిజం బయటపడింది ఆటను దుబాయ్ నుంచి వచ్చినట్టు వెలవెల్లడించాడు.

భార్య భర్తలు ఇద్దరికీ టెస్టులు చేయగా ఈ నెల 2 న వాళ్లకు కరోనా నిర్ధారణ అయింది వీళ్లతోపాటు ఆ విందుకు హాజరైన మరో 10 మందికి కరోనా ఉన్నట్లు 3 న తేలడంతో పోలీసులు, అధికారులు అలర్ట్ అయ్యారు.

వాళ్ళతో సన్నిహితంగా ఉన్నవాళ్లను అలాగే ఆ విందులో పాల్గొన్న వాళ్ళను మిత్తంగా 25000 మందికి పైగా వాళ్ళ ఇళ్లలోనే క్వారంటెన్ విధించారు విందులు, వినోదాలు చేసుకునే ముందు దయచేసి ఒక్కసారి పరిస్థితిని అర్ధం చేసుకోండి కొవిడ్-19 అనేది మీ కుటుంబాన్ని మీ ఊరిని మీ ప్రాంతాన్ని చుట్టేయకుండా జాగ్రత్తపడండి.

మీరిచ్చే విందువల్ల పదిమంది పదిరోజులు చెప్పుకోవాలి కానీ ఇలాంటిసమయంలో విందులు ఇస్తే చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి ఎవరు ఏ ములనుంచి వస్తారో తెలీదు ప్రయాణసమయంలో ఎవరిని కాలుస్తారో తెలీదు పొరపాటున ఎవరైనా కొవిడ్-19 భారిన పడ్డారంటే ఇక అంటే సంగతులు.

కేవలం అప్పటికప్పుడే ఆ విందులో పాల్గొని కరోనా ఉన్న వ్యక్తిని కలిసిన ప్రతీ ఒక్కరు ఆ మహమ్మారి బారినపడటం ఖాయం  దీనికి ఎవరు అనర్హులు కారు కాబట్టి విందులు, ప్రార్ధనలు, పూజల కోసం గుమిగూడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular