మంగళవారం, నవంబర్ 28, 2023
Homeసినిమాఎన్ని ఫ్లాప్ లున్నా ఆ హీరోనే కావాలంటున్న నిర్మాతలు | gopichand movies

ఎన్ని ఫ్లాప్ లున్నా ఆ హీరోనే కావాలంటున్న నిర్మాతలు | gopichand movies

హీరో గోపీచంద్ కు ఒక మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. మొదట్లో కొన్ని ఫ్లాప్ లు వచ్చినప్పటికీ తరువాత వరుస హిట్స్ కొట్టి తన ఇమేజ్ ను మళ్ళీ పెంచుకున్నాడు అయితే ఈమధ్య వచ్చిన వరుస ప్లోప్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. లక్ష్యంతో హిట్ ట్రాక్ లోకి వచ్చినా మరలా ఫ్లాప్ లతో డీలా పడిపోయాడు  పైగా gopichand movies లో గౌతమ్ నందా సినిమాకు తెచ్చిన హైప్ ,దాని ఫలితం వల్ల మరింత సమస్య వచ్చింది.

 

ఇక ఆక్సిజన్ సంగతి తెలిసిందే దీనితో మళ్ళీ ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ మద్య వచ్చిన పంతం సినిమా పరావాలేదనిపించింది. గోపీచంద్ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ , డిజిటల్ రైట్స్ బాగానే వస్తున్నాయి పైగా మాస్ మీడియం హీరోలు ఎవ్వరూ అంతగా మాస్ సినిమాలు చెయ్యడం లేదు కుర్రకారు హీరోలు అంతా క్లాస్ సినిమాల మీద ద్రుష్టి పెడుతున్నారు  అందుకే గోపీచంద్ కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.

 

గోపీచంద్ ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. దీనితోపాటు సంపత్ నంది డైరెక్షెన్ లో ఓ సినిమాను అక్టోబర్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇవికాక మరో రెండు బ్యానర్లలో సినిమాలు చేయడానికి గోపీచంద్ ఓకే చేసినట్లు తెలుస్తుంది.

ఈ లెక్కన గోపీచంద్ కు మాస్ సినిమాల కోసం డిమాండ్ బాగానే ఉన్నట్లు కనిపిస్తింది gopichand movies లకు హిందీ డబ్బింగ్, సాటిలైట్, డిజిటల్ అమౌంట్లు చాలావరకు నిర్మాతలను సేఫ్ జోన్లో పడేస్తున్నాయి అందుకే నిర్మాతలు గోపీచంద్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular