శుక్రవారం, మార్చి 29, 2024
Homeరాజకీయంవైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటీవ్

వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటీవ్

ఏపీ లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తెలంగాణా లో రెండురోజుల నుండి కొంచెం కేసులు తగ్గగా ఏపీ లో మాత్రం నిన్ని ఒక్కరేజే 81 కొత్త కేసులు రావడంతో అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయారు. అయితే నిన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది.

వైరస్ సోకిన వారిలో ఎంపీ సతీమణి, కొడుకు, సోదరులు, తండ్రికి సోకింది వీరిలో తండ్రి పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉండడంతో  వారిని హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసికువెల్లి అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు కావడం విశేషం.

అయితే ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో కరోనా కేసులు అదికంగా వస్తున్నాయన్న వార్తలను నమ్మొద్దని, అమెరికా, స్పెయిన్ లాంటి దేశాల్లో మరణాల సంఖ్య చూసి ఆందోళన చెందోద్దని అన్నారు.

మన ఇండియన్స్ లో రేసిస్టంట్ పవర్ ఎక్కువగా ఉంటుందని అందుకే భారత దేశంలో మరణాల సంఖ్య తక్కువగా నమోదౌతుందన్నారు. ప్రస్తుతం మా తమ్ముళ్ళు కర్నూలు జిల్లాలో ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ ప్రస్తుతం కోలుకుంటున్నారని అన్నారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular