యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ .. ఇకపై డబ్బులు కట్టి వీడియోలు చూడాల్సిందే

0
237
YouTube HD offline videos subscription
YouTube HD offline videos subscription

ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా సమాచార మార్పిడి విపరీతంగా పెరిగిపోయింది ఎంటర్టైన్మెంట్ తో పాటు ఉపాధి, విధ్యా, టెక్నాలజీ వంటి విషయాలను యూజర్లకు అందిస్తున్న ప్రపంచ దిగ్గజ సంస్థ యూట్యూబ్ ను ప్రతీ రోజూ చూసే వారి సంఖ్య అధికంగానే ఉంది. యూట్యూబ్ ను నెలకు ప్రపంచవ్యాప్తంగా చూసే వారి సంఖ్య సుమారు 34 బిలియన్స్ మంది దీనిని వీక్షిస్తున్నారంటే యూట్యూబ్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారింది అనడంలో సందేహంలేదు.

ప్రస్తుతం యూట్యూబ్ రెండు రకాలుగా సేవలు అందిస్తుంది వాటిలో ఒకటి Free Version కాగా రెండవది Premium Version. ఈ రెండింటిలో ఫ్రీ వెర్షన్ యూట్యూబ్ వీడియోస్ లో యూట్యూబ్ సంస్థ యాడ్స్ రన్ చెయ్యగా Premium వెర్షన్ వీడియోలకు యాడ్స్ రావు అయితే యూజర్స్ మాత్రం సంవత్సరానికి సరిపడ ప్యాక్ ఎంచుకుని కొంత మొత్తంలో యూట్యూబ్ కి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో కొన్ని ప్రీమియం మూవీస్ తో పాటు అడ్వాన్స్ షో లు కూడా యూట్యూబ్ అందిస్తూ వస్తోంది.

అయితే త్వరలో యూటూబ్ కొత్త అప్డేట్ ను తెరపైకి తీసుకు రానుంది. ఈ అప్డేట్ ద్వారా ఇప్పటివరకూ యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకునే ఆఫ్ లైన్ వీడియోలను ఫ్రీగా వీక్షించేవారు ఇకపై అన్ని రకాల ఆఫ్ లైన్ వీడియోలను ఆఫ్ లైన్ లో వీక్షించ డానికి కుదరదు. త్వరలో యూట్యూబ్ HD, Full HD, 2K, 4K, 8K వంటి క్వాలిటీ గల వీడియోలు ఆఫ్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకుని చూడడానికి ఇక కుదరదు అందుకంటే యూట్యూబ్ ఈ వీడియోలను YouTube Premium Version తీసుకున్న వారికే ఈ విడియోలు యూటూబ్ లో ఆఫ్ లైన్ లో డౌన్లోడ్ చేసుకుని చూడడానికి వీలుంటుంది.

ఏదేమైనా ఈ అప్డేట్ ద్వారా ఇంటర్నెట్ స్లోగా ఉండే వారికి ఆఫ్ లైన్ క్వాలిటీ వీడియోలు చూసేవారికి నిరాశ ఎదురైందనే చెప్పాలి. ప్రస్తుతం అన్ని రకాల ఆఫ్ లైన్ వీడియోలు డౌన్లోడ్ అవుతున్నాయి త్వరలో యూట్యూబ్ తీసుకువచ్చే అప్డేట్ కొత్త మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.