Thursday, November 26, 2020
Home రాజకీయం నాడు జగన్ అని కొట్టుకున్న గుండె నేడు పేకాట అని కొట్టుకుంటుందా

నాడు జగన్ అని కొట్టుకున్న గుండె నేడు పేకాట అని కొట్టుకుంటుందా

నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రతిష్ట మసకభారిన తరుణంలో ఉండవల్లి శ్రీదేవి ఘటనతో పుండు మీద కారం చల్లినట్లైది.

కొద్దిరోజుల క్రితం పోలీసు అధికారిని నా కాళ్ళు పట్టుకుని నువ్వు ఈ పోస్టింగ్ లోకి వచ్చావ్ నాదగ్గరే నాటకాలు ఆడతావా నాతో పెట్టుకుంటే నిన్ను ఇక్కడ లేకుండా చేస్తా అంటూ గతంలో పోలీసు అడికారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి బయట పడింది.

నేడు ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు సోషల్ మీడియా వేదికాగా శ్రీదేవి పై పలు కామెంట్స్ చేసారు. దీనిలో ప్రధానంగా ఎమ్మెల్యే శ్రీదేవి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తాను తన పూచీకత్తుపై డబ్బులు ఇప్పించానని నేడు ఆ డబ్బులు అడిగితే మాపై కేసులు పెట్టి వేదిస్తున్నారని ప్రస్తుతం ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో తాము ఉన్నామంటూ ఆరోపించారు.

అయితే సందీప్ ఒక ఆడియో కాల్ ను సోషల్ మీడియాలో బయట పెట్టారు దీనిలో ప్రధానంగా ఊరి బయట తోటల్లో పేకాట గుట్టుచప్పుడు కాకుండా ఆడిద్దామని ఈ పని మేనేజ్ చేసుకుంటే ఎంతోకొంత డబ్బులు సంపాదించుకోవచ్చు అంటూ ఉండవల్లి శ్రేదేవి మరియు సందీప్ ల మద్య జరిగిన ఆడియో టేప్ ను సందీప్ మీడియాకి విడుదల చేసారు.

అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీదేవి మాత్రం తాను ఇలాంటి పని చెయ్యలేదని, తనపై కుట్ర జరుగుతుందని, ఆ వాయిస్ తనది కాదని ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరపాలంటూ ఆమె మీడియా సమావేశంలో తెలిపారు.

అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకూ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. సాక్షాదారాలతో బయట పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవిని పదవి నుండి తొలగించాలంటూ ఆరోపిస్తున్నారు. సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారని, చట్టాలు వైసీపీ పార్టీ నేతలకు వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు జగన్ పన్నులతో ప్రజలపై భారం మోపుతుంటే ఎమ్మెల్యేలు మాత్రం అక్రమ మార్గాల నుండి డబ్బు కూడబెడుతున్నారు. ఒక వైపు జగన్  ఆన్ లైన్ బెట్టింగ్ బ్యాన్ చేస్తామని చెబుతుంటే ఎమ్మెల్యేలు మాత్రం రియల్ టైమ్ బెట్టింగ్ లోకి అడుగుపెట్టడం తో వైసీపీవిధానాలు ఏపాటివో అర్ధమవుతూనే ఉన్నాయి.

ఇప్పటికే కమెడియన్ పృద్విరాజ్ ఆడియో టేపు బయట పడి SVBC చైర్మన్ నుండి పృథ్వి రాజ్ ను తొలగించగా నేడు ఉండవల్లి శ్రేదేవి ఆడియో తో పదవి పోయేనా అనే సందేహం తలెత్తుతుంది.  

Most Popular