చివరికి జగన్ ప్రయాణం “అమ్మఒడి” లోకేనా

0
223
jagan and sonia gandhi photo
jagan and sonia gandhi photo

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్త రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారుతున్నాయి. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ప్రధాన లక్ష్యం అంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అనుకూల వోట్లు చీల్చబోమని దీనికి మిగతా పార్టీల సహాయం అవసరం ఉంటుందని సూచాయిగా చెప్పుకొచ్చారు. దీనితో అభువ్రుద్ది దృష్ట్యా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో భాగా వ్యతిరేకత ఉండడంతో వైసీపీ కేబినెట్ మార్పు కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రిపరేషన మొదలు పెట్టేసినట్లు అర్ధమవుతోంది.

గతంలో టీడీపీ పొత్తులపై వైసీపీ ఇప్పటికే టడీపీ పై పలుమార్లు విమర్శలు చేస్తూ “సింగిల్ హ్యాండ్ గణేష్” లాగా డైలాగులు సందిస్తూ వచ్చేది కానీ రాష్ట్రంలో వైసీపీ పాలన కుంటుపడడంతో 2024 ఎన్నికల్లో గెలవకపోతే ఉన్న కేసులతో మరోసారి జైలుకు వెళ్ళక తప్పదనే ఉద్దేసమో ఏమోగాని ఏ వ్యవహారంపై మీడియాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఏపార్టీ కాపాడితే ఆ పార్టీతో కలిసి పనిచేస్తామనడంతో రాష్ట్ర ప్రయోజనాలా లేక మీ సొంత ప్రయోజనాలకోసమా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.

అధికారికంగా ప్రకటించకపోయినా వైసీపీ మరియు కాంగ్రెస్ పొత్తుపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందంటున్నారు విశ్లేషకులు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం వైసీపీ పార్టీ కాంగ్రెస్ ను పతాలలోకి తోక్కదానికే పుట్టిందంటూ వారితో పొత్తు ఉండదని తేల్చేస్తున్నారు. జగనన్న పధకాలలో అమ్మఒడి ఒకటి ఆ పధకం ఎలాగూ ఎగ్గొట్టి విద్యార్ధులను మోసం చేసిన జగన్ చివరకు తన పార్టీ అమ్మఒడికే వెళుతుందంటూ చివరికి వైసీపీ కాంగ్రెస్ రెండూ కలుస్తున్నాయంటూ సోనియా గాందీని ఉద్దేశించి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు . 

ఇది కూడా చదవండి: 10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం … సజ్జల