ఆదివారం, ఫిబ్రవరి 5, 2023
Homeజాతీయంబ్రేకింగ్ .. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కళ్లుచెదిరే రేట్లు ఇవే చూడండి..

బ్రేకింగ్ .. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కళ్లుచెదిరే రేట్లు ఇవే చూడండి..

దాదాపు నెల రోజులనుంచి లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడ్డాయి. ఇక మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు అటు తెలంగాణా లో మద్యం దొరక్క కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయ్. మరికొందరు మతిస్థిమితం లేక ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లిన దాఖలాలు ఉన్నాయ్. ఇక ఎట్టకేలకు ఏపీలో మద్యం దుఖాణాలు తేర్చుకోబోతున్నాయ్ ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మందుబాబులకు షాక్‌ ఇచ్చింది.

మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన కొన్ని సడలింపులలో భాగంగా గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరవచ్చని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే మే 4 నుంచి ఏపీలో లిక్కర్‌ షాపులు తెరుచుకున్నాయ్.. తెలంగాణలో వైన్‌ షాపులు తెరవడానికి ‌ఎక్సైజ్‌ శాఖ నో చెప్పింది.

మద్యం రేట్లు అమాంతం పెంచేసింది. ఏకంగా 25శాతం మద్యంపై ధరలు పెంచుతున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం ప్రకటించింది. ఈ వార్తతో మందుబాబులు షాక్ తిన్నారు. కొత్త ధరల చూసినట్లయితే గతంలో రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.20 పెంచారు, గతంలో హాఫ్ బాటిల్‌పై ఉన్న ధరకంటే రూ.40 పెంచారు ఇక ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగి మద్యం తాగకుండానే కిక్కు లేపింది. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.40 పెంచారు. పోనీ బీర్లు తాగి చల్లబడదామనేవాళ్లకు కూడా ఈ రేట్ల సెగ తగిలింది చిన్న బీర్‌పై రూ.20, పెద్ద బీర్‌పై రూ.30 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ .

అయితే మద్యం విక్రయాలకు టైం తో పాటు కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చు. మద్యం ఫుఖానాలలోకి వెళ్ళేటపుడు మాస్క్‌ లేకపోతే మద్యం అనుమతి లేనేలేదని తేల్చి చెప్పారు అధికారులు.

RELATED ARTICLES

Most Popular