ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు తమ రహస్య సంబంధాన్ని గత సంవత్సరం బహిరంగ పరచినప్పటి నుండి ఇద్దరూ ఎప్పుడు ముడి పడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వారు కలిసి ఎన్నో ఫంక్షన్లకు హాజరయ్యారు మరియు వారు పబ్లిక్ ఫోరంలలో కూడా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్త పరుచుకున్నారు. వాళ్ళిద్దరి వివాహం పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి..
వాళ్ళ పెళ్లి వేడుక ఫ్రాన్స్ లో జరుగుతుంది అని ఒకరు చెప్పగా మరొకరు వాళ్ళు ఇప్పటికే క్యాటరర్లను బుక్ చేసి ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచి తో సమావేశాలు జరుపుతున్నారని చెప్తున్నారు. చాలా వరకు ఈ వార్తలన్నీ అబ్భాద్ధాలు అని తేలింది..
అంతే కాకుండా 2020 వింటర్ లో వీళ్ళు పెళ్లి చేసుకొన్నారన్న వార్త కుడా వినిపించింది. ప్రముఖ జ్యోతిష్కుకుడు వినోద్ కుమార్, వీళ్ళ పెళ్లి ఇప్పుడు వాయిదా వేసుకుంటే రాబోయే సంవత్సరాల్లో కెరీర్ బాగుంటుంది అని చెప్పినందుకు వాళ్లు పెళ్లి మానుకున్నట్టు ఇటీవల ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని తన సోషల్ మీడియా లో షేర్ చేసినట్టు తెలుస్తోంది.
వాళ్ల ఇద్దరి జాతకాల్లో నక్షత్రాలు సానుకూలంగా ఉన్నాయని అయినప్పటికీ ఆలియా జాతకం లో చిన్న సమస్య ఉంది అని వినోద్ కుమార్ చెప్పారు. దాని వల్ల వాళ్ళ జీవితాల్లో చిన్న పాటి గందరగోళాలు రావొచ్చని చెప్పారు. వాళ్ల కుటుంబ సభ్యులను వారి వారి జ్యోతిష్కులను సంప్రదించామని సలహా ఇచ్చారు..
ఆలియా మరియు రణబీర్ కపూర్ ఇంతక ముందు చాలా సార్లు గొడవ పడ్డారు. ఒక వేళ అదే పెళ్లి ఇన్ని సార్లు వాయిదా పడటానికి కారణం కావొచ్చు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం జాతకం సమస్యలను పరిష్కరించుకున్న తరువాత ఆలియా మరియు రణబీర్ పెళ్ళి చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు.