శుక్రవారం, మార్చి 24, 2023
Homeసినిమాkajal aggarwal చిరు కోసం ఆ హీరోని వద్దని చెప్పిందా

kajal aggarwal చిరు కోసం ఆ హీరోని వద్దని చెప్పిందా

kajal aggarwal ఎప్పుడూ  బిజీగా ఉండే అగ్ర కథానాయికల్లో ఒకరు. ప్రొజెక్ట్స్ వస్తుంటాయి పోతుంటాయి వాటిలో కొన్ని విజయం సాధిస్తాయి మరికొన్ని అపజయాన్ని మూటగట్టుకుంటాయ్ కానీ ఏ దర్శకుడైనా హీరో అయినా సినిమా హిట్ కొట్టాలనే తీస్తారు కానీ kajal aggarwal కి మాత్రం ఈ ఫార్ములా నచ్చదేమో ఈ నేపథ్యంలోనే  కోలీవుడ్ లో ఒక హీరో సినిమాకు నో చెప్పిందట అమ్మడు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే ఆ హీరో ముందు సినిమా డిజాస్టర్ అవ్వడమే  ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

అయితే తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు సూపర్ కంబినేషన్స్ లో అదరగొట్టింది. వీటితోపాటు ఐటెం సాంగ్స్ లో కూడా జనాన్ని ఉర్రుతలూగించింది కాజల్. ఇక తమిళం విషయానికొస్తే  అక్కడి కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ కొత్త సినిమాలో చేయబోతోందని  ఇటీవలే వార్తలొచ్చాయి. ఇప్పటికైతే కాజల్  చిరంజీవి ‘ఆచార్య’లో అలాగే పవన్‌ సినిమాలోనూ నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక చేతిలో ఇన్ని బడాహీరోల ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల స్టాలిన్​కు kajal aggarwal నో చెప్పిందని సమాచారం.

అయితే కేవలం ప్రాజెక్ట్స్ ఉండటంవల్లే స్టాలిన్ కి నో చెప్పలేదు ఇటీవల  స్టాలిన్‌ నటించిన ‘సైకో’ సినిమా. ఇది  సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. పైగా అంచనాలను అందుకోలేకపోవడంతో  పాటూ వసూళ్లు దక్కించుకోకపోవడం ఇవన్నీ కాజల్ క్యాలికులేషన్ కి సరిపోలేదేమో అందుకే నో చెప్పడానికి కారణమని చెప్పుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular