మంగళవారం, నవంబర్ 28, 2023
Homeజాతీయంమద్యం షాపుల తెరవడంతో ఎగబడుతున్న జనం

మద్యం షాపుల తెరవడంతో ఎగబడుతున్న జనం

ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలౌతున్న నేపథ్యంలో కిక్కు కోసం మందు బాబులకు ఏమిచెయ్యాలో తెలియక కంటి మీద కునుకు లేకుండా తయారైంది పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణాలో పలువురు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కూడా వదిలారు చాలామంది మద్యానికి బానిసలైనవారు మతిస్థిమితం తప్పి ఎర్రగడ్డలో జాయిన్ అయ్యారు.

ఇక అసోంలో ప్రభుత్వానికి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయో ఏమో అక్కడ సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్​డౌన్​ వల్ల మందులేక నోరారిపోయిన మందుబాబులు ఈ క్షణం కోసమే  ఎదురు చూసారు .. సోమవారం తెరిచిన వెంటనే లిక్కర్​ షాపుల ముందు క్యూ కట్టారు.

లాక్​డౌన్​తో ఎక్కడికక్కడ మందుషాపులు మూతపడటంతో ఇన్నాళ్లు మద్యం దొరక్క అవస్థలుపడ్డ మందుబాబుల దాహార్తి తీర్చేందుకు సోమవారం ఉదయం నుంచి లిక్కర్​ షాపులు  తెరిచింది అసోం ప్రభుత్వం. ఒక్క చుక్క లిక్కర్ కోసం మొహం వాచేలా ఎదురుచూసిన మందుబాబులకు ఇదొక విందులా అనిపించింది.

షాప్స్ ఓపెన్ అయిన వెంటనే బారులుతీరారు. యువత, కొంతమంది మహిళలు, వృద్ధులు.. మద్యం దుకాణాల ముందు భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్నారు. ప్రతి రోజు 7 గంటల పాటు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిలిస్తూ అసోం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular