అమెరికాలో అయోమయానికి అదే కారణమా..కరోనా ఈ పేరు అగ్రరాజ్యాలను కూడా వణికిస్తుంది. ఏ దేశమెళ్లినా ప్రస్తుతం కరోనాతో ప్రజలు విలవిల్లాడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ వైరస్ ధాటికి పెద్దన్న అమెరికా కూడా విల విల్లాడిపోతోంది. ఇక న్యూయార్క్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయిందని అక్కడి మరణాల సంఖ్య చెప్పకనేచెబుతోంది ఆ రాష్ట్రంలో ప్రతీ రెండున్నర నిమిషాలకి ఒకరు లెక్కన శనివారం ఒక్కరోజే 630 మంది మరణించారు.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు నమోదైతే ఇందులో అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 3 లక్షలు మించింది. దీనికి కారణం అమెరికాలో రాకపోకలకు ఆంక్షలు విధించడానికి ముందు ఇక్కడికి చైనా నుంచి ఎక్కువశాతం రావడమే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఊహన్ నుంచి వేళల్లో అమెరికాకు వచ్చారని న్యూయార్క్ టైమ్స్ తన ఆర్టికల్ లో వెల్లడించింది. ఇదంతా ట్రంప్ విదేశీ రాకపోకలపై ఆంక్షలు పెట్టకముందే జరిగిపోవడం తో ప్రస్తుతం అమెరికా లో ఈ దుస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.