మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాబాలయ్య బాబు ఏం చేస్తాడో ఏంటో మరి ..?

బాలయ్య బాబు ఏం చేస్తాడో ఏంటో మరి ..?

ప్రస్తుతం తెలుగు  చిత్ర సీమ మొత్తం లొక్డౌన్ నేపథ్యంలో రకరకాల చాలెంజ్ లు ఒకరిమీద ఒకరు విసురుతూ  చాలా ఆశక్తికరంగా మారింది వీటిలో ముఖ్యంగా ఇప్పుడు  ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ ఛాలెంజ్ లో తమ ఇళ్లల్లో  పనులు చేయడం ఇంట్లో ఉండే మహిళలకు  సహాయపడటం వంటివి మరియు వంటింట్లో సహాయం చేయడం లాంటి వాటితో ఇప్పుడు ఇది చాలా క్రేజీగా సాగుతుంది ఈ ఛాలెంజ్.

అసలు మొదట ఈ ఛాలెంజ్తెరపైకి రావడానికి ముఖ్య కారణం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా. వంగా తాను  ఇంట్లో అన్నీ పనులూ చేసి ఆ వీడియోను రాజమౌళి కి ట్యాగ్ చేస్తూ ఛాలెంజ్  చేసారు. ఇక ఛాలెంజ్ ను స్వీకరించిన  రాజమౌళి కూడా తన ఇంట్లో  పనులు చేసి తాను కూడా ‘బి ది రియల్ మ్యాన్’ అనిపించుకుని అక్కడితో ఆపెయకుండా ఆ వీడియోని జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ – సుకుమార్ మరియు బాహుబలి నిర్మాతలు యార్లగడ్డ  శోభులకు ఈ ఛాలెంజ్ విసిరాడు.

ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఒకరకంగా హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటి పనులన్నీ చకచకా చేసేసి ఆ చాలెంజ్ ను టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలైన చిరంజీవి – నాగార్జున – బాలయ్య – వెంకటేష్ వంటి బడా హీరోలకి ఈ ఛాలెంజ్ విసిరాడు. అయితే రాజమౌళి విసిరినా చాలెంజ్ ను  రాంచరణ్ – సుకుమార్ ఇద్దరూ విజయవంతంగా పూర్తిచేశారు.

ఇక  కొరటాల శివ కూడా తన  ఛాలెంజ్ పూర్తిచేసి దానిని అర్జున్ రెడ్డికి అదేనండి విజయ్ దేవరకొండకు  ఛాలెంజ్ విసిరారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన ఛాలెంజ్ ను  నేడు పూర్తిచేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు.

ఇప్పుడు టాలివుడ్ లో సినీ ప్రేక్షకులతో పాటు  అందరూ  నటసింహం బాలయ్య బాబు చేసే వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్య బాబు  నుండి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఈ చాలెంజ్ ని బాలయ్య లైట్ గా తీసుకుంటాడా అనేది టాలీవుడ్ స్టార్స్ తో పాటు సినీ ప్రేక్షకులంతా బాలయ్య బి ది రియల్ మ్యాన్ వీడియో కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular