తాజాగా విశాఖలోని ఈ ఘటన నిన్న అర్ధరాత్రి పూట ఆర్ఆర్ వెంకటాపురం లో జరిగింది. ఆర్ఆర్ వెంకటాపురం లోని LG POLYMERS CHEMICAL INDUSTRY (ఎల్ జీ పాలిమర్స్ కెమికల్స్ ఇండస్ట్రీ) లోని లీకైన విష రసాయన వాయువులు ప్రమాదకరం అని విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ విషవయువుల వల్ల 11 మంది మృతి చెందినట్లు ఎన్టీఆర్ ఎఫ్ డీజీ SN తెలిపారు. RR వెంకటాపురం తో పాటు బీసీ కాలనీ 66 వ వార్డు పై విష వాయువు ప్రభావం ఎక్కువ గా ఉన్నట్టు తెలిపారు.

విషవాయువు పీల్చిన మూగ జీవాలు నురగలు కక్కుతూ చినిపోయాయి. ఈ గ్యాస్ ప్రభావానికి స్థానికులు ఉక్కిరబిక్కిరై ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా ఎక్కడికి అక్కడే కుప్పకూలిపోయారు.విశాఖ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ప్రభావానికి గురైన వారికి మెరుగైన చికిత్స అంద చేస్తున్నామన్నారు . అయితే 30 మంది పరస్థితి విషమంగా ఉందని. 80 మందిని పైగా వెంటిలేటర్ ల పైనే ఉన్నారని చెప్పారు.
అయితే ఈ ఘటన పై హై కోర్టు విషవాయువు ప్రమాదం మీద విచారణ చేపట్టిన ధర్మాసనం దానిని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ ఘటన పై అఫిడవిట్ దాకలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు కోర్టు నోటీసులను జారీ చేసింది.
మృత దేహాలకు రేపు పోస్టుమార్టం..
విశాఖ గ్యాస్ లికేజ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృత దేహాలు KGH మర్చూరీలో ఉన్నాయని తెలిపారు. ఈ మృతదేహాలకు రేపు ఉదయం శవ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు . అయితే ఇటు విశాఖలోని వివిధ ఆసుపత్రిలో 316 మంది భాదితులు చికిత్స పొందుతున్నారు . విశాఖ కేజీహెచ్ లో 193 మందికి చికిత్స జరుగుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో 66 మంది, గోపాల పట్నం , పెందుర్తిలో 57 మందికి చికిత్స జరుగుతుందన్నారు వైద్య నిపుణులు.