అమరవీరుల స్థూపం వద్ద ఆమె ఎవరు…?

0
171
virataparvam sai pallavi first look
virataparvam sai pallavi first look

అమరవీరుల స్థూపం దగ్గర ఏదో ఆలోచనలో మునిగిపోయి. ఒంటరిగా కూర్చుంది, పక్కనే డైరీ చేతిలో పెన్ను ఉన్నాయి. అసలు ఆమె అక్కడ ఎందుకు కూర్చుంది పక్కనే ఉన్న ఆ డైరీలో ఏం రాసుంది ఇలాంటి క్యూరియాసిటీ కలిగించే విషయాలు శనివారం రిలీజైన విరాటపర్వం  పోస్టర్ లో సాయి పల్లవిని చూడగానే అనిపిస్తాయి.. అయితే వీటన్నియికి సమాధానం దొరకాలంటే మాత్రం మా విరాట పర్వాన్ని చూడాలంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల.

రాణా, సాయిపల్లవి ప్రధాన పత్రాలు సుధాకర్ చెరుకూరి నిర్మాత ఈ సినిమాని సురేష్ బాబు సమర్పిస్తున్నారు. శనివారం సాయిపల్లవి పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం విరాటపర్వంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి అందరణతో వైరల్ అవుతోంది.

ఒక కొత్త కధగా, వైవిధ్య భరితంగా ఉండబోతున్న ఈ సినిమాలో రాణా సాయిపల్లవి పాత్రలు కొత్తగా ఉంటాయని దర్శకుడు వేణు ఊడుగుల అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసిన వేణు కథ కూడా సూపర్ గా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వడంతో అంతా విరాటపర్వంకోసం వెయిటింగ్..