ఆదివారం, జూలై 21, 2024
Homeరాజకీయంవిజయసాయి రెడ్డి నీ బెల్ట్ ఖరీదు 50 వేలు.. సోషల్ మీడియాలో వార్

విజయసాయి రెడ్డి నీ బెల్ట్ ఖరీదు 50 వేలు.. సోషల్ మీడియాలో వార్

గత కొద్ది రోజులుగా దేశప్రజలు కరోనా కష్టంతో కకావికలమౌతున్నారు. రాష్ట్రంలో ప్రజలు పనులు లేక ఇంటినుండి బయటకి వెళ్లే పరిస్థితి లేక విలవిలలాడుతున్నారు. ఇక పనిచేసుకునే రోజువారీ కూలీలు తమ బతుకెటుపోతుందో తెలియక తినడానికి ముద్దదొరికితే చాలన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారు.

కానీ మన రాజకీయ  నేతలు మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రాజకీయంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు సెటైర్లు వేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఇప్పుడు ఈ వ్యవహారం ఇతర రాష్ట్రాల ప్రజలు చూసి నవ్వుకునేలా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ట్రోల్ అవుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు బాలేదంటూ రాష్ట్రం ఆర్థిక ఒత్తిడిలో ఉందంటూ ఓ వైపు జగన్ ఆర్టీసీ తో అదేవిధంగా కేంద్రంతో రాష్ట్ర ఇబ్బందులను వెళ్లబుచ్చుతుంటే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ నుంచి మాత్రం ప్రతిపక్షం పై ఎప్పుడూ సమయం సందర్భం లేని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెటుతున్నారు.

హైదరాబాద్ ఆయన బసచేసే  లో మల్టీ స్టార్ హోటల్ కి ఆయన చెల్లించే బిల్లులు సైతం సుమారు పది క్కోట్లు అంతేకాక ఆయన వాడే ప్రత్యేక బస్సు మరియు హిమాలయ వాటర్ బాటిల్స్  కు పెట్టిన ఖర్చుతో కరోనా వార్డుల్లో వెయ్యి వెంటిలేటర్లు వచ్చేవి.

కొనాలన్నా వెంటనే లభ్యం కాని పరిస్థితి ఇప్పుడు. ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసి మీ బతుకు-మీరు బతకండి అని అందరినీవదిలేసి పారిపోయిన వ్యక్తి ఆయనకు  ఒక విజనరీ అంట! అంటూ ట్విట్టర్ లో కామెంట్లు చెయ్యడంతో అటు టీడీపీ నేతలు కూడా భగ్గుమన్నారు.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న డైరెక్ట్ గా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు‘‘ఏ2 రెడ్డి గారూ, మీ న‌డుంకి క‌ట్టుకునే బెల్టు ఖ‌రీదు 50 వేలు. ఏ1 రెడ్డిగారు ఒక్క‌రోజు హైద‌రాబాద్ వెళ్లిరావడానికి 60 ల‌క్ష‌లు. ysjagan గారి తాడేప‌ల్లి కొంపకు ఇప్ప‌టివ‌ర‌కూ అయిన కరీదు 18 కోట్లు అయ్యిందని అన్నారు.

బ‌కారుసుడిలాగా ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జాధ‌నం బోక్కేస్తున్న మీరు, చంద్ర‌బాబు తాగే హిమాల‌య వాట‌ర్ బాటిల్ నీరు గురించి మాట్లాడుతున్నారు. వాట‌ర్ బాటిల్ ఒక్క‌టి రూ.50, రోజుకు రెండు బాటిళ్లు తాగినా 100, నెల‌కు 3000, ఏడాదికి 36000 ఐదేళ్ల‌లో 1 ల‌క్షా 80 వేలు మాత్ర‌మే కర్చు అవుతుంది.

రెడ్డిగారూ మీ ఏ1 గారి ఒక్క‌రోజు హైదరాబాద్ లో చేసే ఖ‌ర్చులో చంద్ర‌బాబు తాగే నీరు ఖ‌ర్చు మొత్తం ఐదేళ్ల‌లో సుమారు 3 శాతం కూడా లేదు.  మాపై ఎందుకీ  ఏడుపు విజయసాయి రెడ్డి గారూ’’ అని సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

ఒకవైపు  రాష్ట్రంలో కరోనా కేసులు అమాంత పెరిగిపోతూ మరణాలు సంభంవించే స్థాయికి వచ్చేసింది  ఇలాంటి సమయంలో ఇలాంటి పనికిరాని పనులేంటంటూ జనం రగిలిపోతున్నారు. మన పక్కరాష్ట్రల్లో పార్టీలకు అతీతంగా అందరూ కలసి కరోనా పై పోరాడుతుంటే ఏపీ లో మాత్రం కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయంటూ  సోషల్ మీడియా వేదికగా ప్రజలు మండిపడుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular