మంగళవారం, నవంబర్ 28, 2023
HomeసినిమాVakeel Saab కోసం మీదగ్గర ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా…పవన్ ఫ్యాన్స్

Vakeel Saab కోసం మీదగ్గర ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా…పవన్ ఫ్యాన్స్

జనసేన అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ప్రజా క్షేత్రం లో బిజీగా ఉంటూనే చాలా సమయం తరువాత నటించిన సినిమా Vakeel Saab. ఏప్రెల్ నెలలో దియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

హిందీ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కాసుల వర్షం కురిపిస్తూ కరోనా సెకండ్ వేవ్ లోనూ సుమారు 80 కోట్ల రూపాయల రాబట్టింది. అయితే కరోనా కారణంగా చాలా మంది ఫ్యామిలీస్ ఈ సినిమాను అప్పట్లో చూడలేకపోవడంతో చాలా నిరుత్సాహపడ్డారు. అయితే సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.

ఇక డిజిటల్ రైట్స్ లో భాగంగా నేడు Zee Telugu లో ప్రసారం కావడం తో పవన్ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. దీనికి ప్రధాన కారణం వకీల్ సాబ్ రిలీజ్ సమయంలో తెలంగాణ లో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వగా ఏపీ లో మాత్రం ప్రీమియర్ షోలతో పాటు టికెట్స్ రేట్స్ కూడా కరోనా కారణంగా తగ్గించడంతో పవన్ ఫాన్స్ తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

అయితే నేడు మళ్ళీ వకీల్ సాబ్ బుల్లి తెరలలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను ఆపడానికి ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటూ పవన్ ఫ్యాన్స్ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేయడమే కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాపై తెగ ప్రచారం చేస్తున్నారు.

Read Also..పట్టాలెక్కిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హైవే మూవీ 

                భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular