ఆదివారం, జూలై 21, 2024
Homeటెక్నాలజీTV Channels Rates: జనవరి 1 నుండి మారనున్న టి.వి చానళ్ల ధరలు

TV Channels Rates: జనవరి 1 నుండి మారనున్న టి.వి చానళ్ల ధరలు

టెలికాం రేగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రవేశపెట్టిన కొత్త నిభందనలను ప్రవేశపెట్టింది. వినియోగదారుల కోసం కొత్త ధరలను ప్రవేశ పెట్టింది. దీని వలన వినియోగదారులు వారు చూడని చానళ్ల కు డబ్బులు చెల్లించనవసరం లేదు. దీనితో పేద మరియు మధ్య తరగతి ప్రజలకు కొంచెం డబ్బు ఆదా అవ్వనుంది.

ట్రాయ్ నిర్ణయించిన కొత్త ధరల జాబితాలో HD చానళ్ళ ధరలు కొంచెం అధికం కానున్నాయి. ప్రతీ కుటుంబంలో వారి వయస్సును బట్టి ఒక్కో టీవీ చానల్ కి అలవాటు పడుతుంటారు. ఇలా విబిన్న ఛానళ్ళను ఇష్టపడే వారికి మాత్రం ధరల మోత మొగనుంది.

మొన్నటి వరకూ సుమారు మూడు వందల చానళ్ళు ఇంచుమించు రూ.200 కే లభించేవి కానీ ఇప్పుడు భారీ స్థాయిలో పెరగడంతో ఎక్కువ చానళ్ల ను వీక్షించే వారు కొన్ని ఛానళ్ల ను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ ఎక్కువ ఛానళ్ల ను తక్కువ ధరకే చూసేవాళ్ళు ఈ కొత్త నిభంధనలపై వీక్షకులు పెదవి విరుస్తున్నారు.

తిరిగి డిష్ కి మారిపోదామన్నా ట్రాయ్ నిబంధనల ప్రకారం త్వరలో డిష్ టీవీ రెట్లు కూడా టీవీ చానళ్ళకు అనుగుణంగా సంవత్సర టారిఫ్ ప్లాన్ లు పెరగనున్నాయి.   

ప్యాక్ వివరాలు

బేసిక్ ప్యాక్ లో 100 చానళ్ల వరకూ ఇస్తుండగా దీనికి రూ.130 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా మీకు కావాల్సిన చానళ్ల ప్యాక్ లను రూ. 130 + మీరు తీసుకునే ప్యాక్ + జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో 200 రూపాయలుగా ఉన్న ప్యాక్లు కాస్తా 400 నుండి 600 వరకూ ఖర్చయ్యే అవకాసం ఉంది.

 

TV Channels Rates

స్టార్ మా ప్యాక్ (39), దీనిలో మాటీవీ, మా మూవీస్, మా మ్యూజిక్, స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ ఒన్ మరిన్ని చానెల్స్ ఈ ప్యాక్ లో ఉంటాయి.

జీ టీవీ (20) జీతెలుగు -19, జీ సినిమాలు – 10 రూపాయలకి అందివ్వనున్నాయి. అంతే కాక స్పోర్ట్స్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కార్టూన్, వంటి చాన్నాళ్లు కావాలంటే సుమారు 700 రూపాయల వరకూ కర్చు చెయ్యాల్సిన పరిస్థితి. ఇంటిలో సీరియళ్ళు మరియు న్యూస్ చూసేవారికి దీనివలన ఉపయోగం ఉండగా వీటితోపాటు మిగతా ఛానళ్ళను చూసేవారికి ఇది మింగుడుపడని విషయమే.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular