గురువారం, మార్చి 28, 2024
Homeభక్తిటీటీడీ కీలక నిర్ణయం ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు

టీటీడీ కీలక నిర్ణయం ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల పై మళ్లీ కరోనా ప్రభావం. శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకంతంగానే ఆలయ ప్రాంగణంలో నిర్వహించగా.. ఇప్పుడు ఇ నెల 16 నుంచి 24 తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా టీటీడీ నిర్ణయించింది. అతి తక్కువ  సంఖ్యలో భక్తులను ఈ ఉత్సవానికి అనుమతించి స్వామివారిని మాఢ వీధుల్లో బ్రహ్మోత్సవ వాహన సేవలను నిర్వహించాలని ఈ నెల 1వ తేదీన  టీటీడీ భావించింది.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిన చిత్తూరు జిల్లా లో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గటం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలను తిలకించేందుకు పరిమితి కి మించి భక్తులు గాలరీ లోకి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే మొదటగా మాఢ వీధుల్లో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కరోనా తీవ్రతతో స్వామివారి ఉత్సవం ఏకాంతంగానే నిర్వహించాలని టిటిడి అధికారులు నిర్ణయించారు.

వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను జరపడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసుకుంది టీటీడీ మండలి. కొత్త ఈవో జవహర్ రెడ్డి  కూడా మాఢ వీధుల్లో ఏర్పాట్లను స్వయంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అయితే  ప్రస్తుత అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో స్వామివారి  ఏకాంతంగానే నిర్వహించాలని అధికారులు సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు.  అలా చేసిన కూడా భక్తుల ను నియంత్రించడానికి కష్టం అని అనుమానం వచ్చి ఆలయం లోనే నిర్వహించాలి అని తుది నిర్ణయం తీసుకుంది టీటీడీ.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular