TS Inter Results 2021
కరోనా తీవ్రత దృష్ట్యా విధ్యార్దుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణా ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పేరెంట్స్ మరియు విద్యార్ధులు హర్షం వ్యక్తం చేసారు. అయితే తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ మార్కులను ఆన్లైన్లో విడుదల చేస్తామంటూ ఈ నెల 25 లేదా 26 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
TS Inter Results Update
అయితే అది కుదరకపోవడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్ధులకు ఈరోజు కూడా నిరాశే ఎదురైందని తెలిస్తోంది. విద్యా శాఖామంత్రి గారికి కొన్ని అనివార్య కారణాలతో నేడు ఫలితాల విడుదల దాదాపు లేదనే తెలుస్తోంది. అయితే పరీక్షా ఫలితాలు విడుదల చేసే వెబ్సైట్ https://www.tsbie.cgg.gov.in లో కొన్ని అప్డేట్స్ చేసినట్లు తెలుస్తోంది. వెబ్సైటు లో రిజల్ట్స్ త్వరలో రిలీజ్ చేస్తామంటూ నోటిఫికేషన్ కనిపిస్తోంది.
అంతేకాక సెకండ్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ వోకెషనల్, సెకండ్ ఇయర్ జనరల్ వొకేషనల్, సెకండ్ ఇయర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ వంటి వాటిని ఈ వెబ్ సైట్లో ఈ రోజు ఉదయం అప్డేట్స్ చేసినట్లు తెలుస్తోంది.రిజల్ట్స్ విడుదలైన తరువాత ఆయా గ్రూపులను బట్టి లింక్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
website లో రిజల్ట్స్ రానివారికోసం
ఇక ఈ రిజల్ట్స్ లో ఎవరైనా విద్యార్ధులను రిజల్ట్స్ రాకపోయినా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఇదే వెబ్సైటు లో క్రింద TSBIE Help Desk వద్ద ఉన్న 040-2600110 నెంబర్ కి కాల్ చేసి అధికారులకు ఈ విషయాన్ని తెలియచేయ్యాల్సి ఉంటుంది. ఇక ఈ ఫలితాలలో 4.73.967 మంది విద్యార్ధుల ఫలితాలు తెలియనున్నాయి.
సంతృప్తి చెంధనివారు తిరిగి పరీక్ష రాసుకునే అవకాశం
అయితే సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ విద్యార్ధుల మార్కులను 100% గా పరిగణించగా తియరీ మార్క్స్ మాత్రంమొదటి సంవత్సరం యొక్క మార్కుల ఆధారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ పరిక్షా ఫలితాలపై విద్యార్ధులు అసంతృప్తి ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ బోర్డ్ తిరిగి పరీక్షలను కోవిడ్ పోతోకాల్ అనుగుణంగా అలాంటి విద్యార్ధులకు తిరిగి పరీక్షలు నిర్వహించనుంది.