గురువారం, సెప్టెంబర్ 29, 2022
Homeఅంతర్జాతీయంట్రంప్ చేతులెత్తేసినట్టేనా ..?

ట్రంప్ చేతులెత్తేసినట్టేనా ..?

అమెరికా అగ్ర రాజ్యం అయితేనేం కరోనా దాటికి కకావికలం అయిపొయింది. ఎంత డబ్బుపోసిన ఎంత ఆధునికత అభివృద్ధి ఉన్నా అక్కడ కూడా వందలమంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది.

3896 మంది మృత్యువాత పడ్డారు. మరో వైపు ట్రంప్ మాటలతో అమెరికన్లు హడలి పోతున్నారు. అమెరికాలో రాబోయే కొద్ది రోజుల్లో గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని దానిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

ఇక కరోనాకు మందు లేదని ఇప్పటికిప్పుడు మందు రాదని కేవలం సామజిక దూరం, వ్యక్తిగత శుభ్రత వల్లే దాన్ని అరికట్టగలమని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాటలపై అందరు పలురకాలుగా అనుకుంటున్నారు.

కరోనా ని ఏం చెయ్యలేక ట్రంప్ కూడా చేతులెత్తేశారు అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేన్నైనా ఎదిరించగలిగే అగ్రరాజ్యం కూడా ఇలా డీలాపడిపోవడం చిన్న దేశాలను కలవరపెడుతోంది.

RELATED ARTICLES

Most Popular