ప్రస్తుతం వేసవి కాలం ముగియకుండానే వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనం గా మారి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది స్థిరంగా కొనసాగుతున్నది. ఇక ఇది వాయుగుండంగా మారి ఈ ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ తన నివేదికలో తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో శనివారం ఉదయం నుంచి సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుందని మరియు ఈదురుగాలుల ప్రభావం కూడా పెరుగుతుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదిలా ఉండగా శని, ఆదివారాల్లో ఎపి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతోపాటు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేసారు. ఇక అక్కడక్కడా తేలికపాటి ఓ మోస్తరు నుండి బారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపద్యంలో మునుపటికంటే నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ ఐదున నైరుతి రుతుపవనాలు దేశంలోని కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ తుఫాన్ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం ఈ నెల 20 నుండి ఉత్తర, మధ్య కోస్తా లో వడగాల్పులు కోడా ప్రారంభవుతాయని ఇస్రో వాతావరణ నిపుణులు తెలియజేసారు.