May 27, 2020

ఈ రోజు రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి లేకపోతే అంతే సంగతులు

naredra modi

naredra modi

ఈ సూచనలు పాటించగలరు.

ఈ రోజు భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపు తో కరోనాపై పోరుకు అందరం సిద్ధం అని తెలియజేయడం కోసం, స్ఫూర్తికోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంటి లో  విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలి. ఫ్యాన్లు, ఏసీలు ఫ్రిజ్, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. ఇవి ఆపడం వల్ల ట్రాన్స్ఫార్మర్ల పై అధిక ఒత్తిడి పడి ఫ్టక్చువేషన్ కు గురవుతాయ్. ఇక అపార్టుమెంట్లు, కాలనీలకు కరెంటు సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్ ఫార్మర్లు, మెయిన్ వద్ద సరఫరా కొనసాగించాలి.

వీధి దీపాలనూ వెలగనివ్వాలి. దేశంలోని అన్ని ఇళ్లలో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్తు గ్రిడ్ పై పడే ప్రభావం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ట్రలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. దేశం మొత్తం మీద గరిష్ఠంగా 12897 మెగావాట్ల లోడ్ తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని రాత్రి తొమ్మిది గంటలకు ముందు తగ్గించి మళ్లీ 9.09 మంటలకు ప్రాంభించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *