Tuesday, February 23, 2021
Home జాతీయం కాంగ్రెస్ కి దెబ్బ.. కమలంతో కుష్బు

కాంగ్రెస్ కి దెబ్బ.. కమలంతో కుష్బు

బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి దేశవ్యాప్తంగా చాలా చోట్ల అనేక మంది పార్టీలో చేరుతున్నారు.. తాజాగా త‌మిళ న‌టి ఖుష్బూ సుంద‌ర్ కూడా సోమవారం బీజేపీలో కండువా కప్పుకున్నారు. డిల్లీలోని భారతీయజనతా పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్య‌క్ర‌మంలో పార్టీ పెద్దలు ఆమెకు  పార్టీ అభ్య‌ర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందజేశారు.

కాంగ్రెస్ లో అసలు కిందిస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఆదేశాలు ఇస్తున్నారని ఇలాంటి పరిణామాలు తనని నిరాశపరిచాయన్నారు ఖుష్బు. అయితే ఏఐసీసీ ప్రతినిధి పదవి నుంచి తనను తప్పించడం పట్ల కూడా ఆమె అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఖుష్బు 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

అయినా సరే 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ  ఖుష్బుకి టికెట్ ఇవ్వ‌లేదు. ఇక తాజాగా కమల దళంలో చేరడంతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బు మంచి పోటీ అవ్వనున్నారు. తమిళనాడులో బీజేపీకి ఆమె మంచి మైలేజ్ తీసుకొస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

Most Popular