మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంకరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ ...కేంద్రం అత్యవసర మీటింగ్

కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ …కేంద్రం అత్యవసర మీటింగ్

భారత్ లో రోజు రోకుకూ కరోనా విలయ తానడం చేస్తుంది గడిచిన 24 గంటల వ్యవది లోనే భారత్ లో రికార్డ్ స్థాయిలో 11,458 కేసులు నమోదయ్యాయి. ఇంత అత్యదిక స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి. కేసులు ఒకేసారి అత్యధికంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది దీనిలో భాగంగా రేపు అమిత్ షా నేతృత్వంలో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అయితే నేడు కూడా ప్రదాని మోడీ.. కరోనా కేసుల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా మరియు హెల్త్ మినిస్టర్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 16 న అన్ని రాష్ట్రాల సీఎం లతో సమావేశం నిర్వహించనున్నారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,760 వీరిలో 8895 మంది మరణించగా ఈ ఒక్క రోజే 386మంది మరణించారు. ప్రస్తుతం దేశం లో అత్యదిక కేసులు నమోదౌతున్న రాష్టాలలో మహారాష్ట్ర మొదటిది తరువాత ముంభైలో అత్యదిక కేసులు నమోదయ్యాయి. మొత్తం దేశంలో నమోదైన కేసులలో మోడో వంతు ఈ రెండు రాష్ట్రాలే అవ్వడం ఇప్పుడు మరణాల సంఖ్య అధికం కావడంతో అధికారులను కలవరపెడుతుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా చేయిదాటే పరిస్థితి కనిపించడంతో కేంద్రం తిరిగి పూర్తి స్థాయి లాక్ డౌన్ విదించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 16 మోడీ ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular