సర్వే లో తిరుగులేని నరేంద్రుడు.

0
143
మోడీ
మోడీ

ప్రస్తుతం దేశంలో ప్రదాని మోడీ పై ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదనే అంశంపై Times Now, Ormax వంటి సంస్థలు ఎప్పటిలాగే సర్వే చేసాయి. ఈ సర్వే ప్రాదాన అంశం కరోనా సమయంలో ప్రదాని తీసుకున్న నిర్ణయాలు, ఇతర దేశాలలో చిక్కుకున్న బారతీయులను స్వదేశానికి తీసుకురావడం పై ప్రదానంగా ఈ సర్వే కొనసాగుతుంది.

అయితే ఈ సర్వే ద్వారా ప్రజలు కరోనా సమయంలో మోడీ అత్యంత స్పీడ్ గా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు కరోనా తీవ్రతను తెలియచేయడంతో పాటు ప్రజలకు విశ్వాశాన్ని కలగాజేయడంలో పూర్తిగా సఫలీక్రుతులయ్యారని ఈ సర్వె ద్వారా బయటికొచ్చింది.

మామూలుగా చిన్న చిన్న దేశాలు కరోనాని కంట్రోల్ చేయడానికి నానా అవస్థలూ పడుతున్నాయి. అలాంటి పరిస్థితిలో భారత దేశంలో సుమారు 135 కోట్ల మంది జనంతో ఒక కనిపించని శత్రువుతో ఆయుధం లేకుండా యుద్డంచేయడం అనేది ప్రధానిగా మోడీ నూటికి నూరు మార్కులు కొట్టారనే చెప్పాలి. ఒకవైపు కరోనా మరోవైపు ఆర్ధిక వ్యవస్థ ఈ రెండూ కత్తిమీద సాములాంటివే. అయినా మోడీ ఆర్ధిక వ్యవస్థ ఎప్పటికైనా గాడిలో పడుతుందనే నమ్మకంతో ముందు ప్రజల ప్రాణాలే మిన్న అని.. కరోనా పనిపట్టే విషయంలో మోడీ ప్రజల మన్ననలు పొందారు.

ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫెరెన్స్ లు నిర్వహించి రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులపై తెలుసుకుని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు మోడీ. అయితే విదేశాలలో చిక్కుకున్న వారి పరిస్థితి దుర్బరంగా మారడంతో అక్కడ కరోనా ఉన్న ప్రజలను సైతం భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నాలతో మోడీపై నమ్మకం ఎలక్షన్స్ కి ముందు 71 శాతం ఉండగా ఇప్పుడు అది 79 శాతం  పెరిగిందని Timesnow, Ormax  తన సర్వెలో తెలిపింది.